AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2027 సంక్రాంతికి సూపర్ స్టార్ సడన్ ఎంట్రీ

2027 సంక్రాంతికి సూపర్ స్టార్ సడన్ ఎంట్రీ

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 09, 2026 | 1:29 PM

Share

నెక్స్ట్ సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి వారి భారీ సినిమాలు విడుదల కానున్నాయి. దీనికి అదనంగా రజనీకాంత్ సినిమా కూడా క్యూలో ఉండటంతో థియేటర్ల కొరత తీవ్రంగా ఉంటుందని ఆందోళన నెలకొంది. స్థానిక చిత్రాలకు ప్రాధాన్యతనిచ్చి, డబ్బింగ్ సినిమాలను నియంత్రించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

తాదూరసందులేదుగానీ.. మెడకి ఇంకో డోలు అన్నట్టుంది నెక్స్ట్ ఇయర్‌ సంక్రాంతి సీజన్‌లో ఉన్న రష్‌ చూస్తే…. మన సినిమాలకే థియేటర్లు దొరుకుతాయో లేదో తెలియని పరిస్థితి. అలాంటిది డబ్బింగ్‌ సినిమాలు కూడా క్యూ లో ఉంటే.. ఆ సీన్‌ ఎలా ఉంటుందో ఊహించుకోండి అన్నట్టుంది సిట్చువేషన్‌. ఐ యామ్‌ ఇన్‌ క్యూ అని సూపర్‌ స్టార్‌ కాంపౌండ్‌ నుంచి సౌండ్‌ వినిపించగానే అలర్ట్ అవుతున్నదెవరు? ఈ సంక్రాంతికి మనశంకరవరప్రసాద్‌గారుతో రీజినల్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి… నెక్స్ట్ పొంగల్‌కి కూడా రావడం పక్కా అని ఫిక్సయ్యారు. బాబీ సినిమాతో పలకరించడానికి ఆల్రెడీ రెడీ అవుతున్నారు చిరు. నేను కూడా వచ్చేస్తున్నాను.. ఈ సారి అనిల్‌తో అని ఆల్రెడీ ఓపెన్‌గానే అనౌన్స్ చేస్తున్నారు వెంకీ మామా. అనిల్‌ – వెంకీ కలిసి వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకులకు నవ్వుల విందు ఇచ్చేస్తున్నారు. సో, నెక్స్ట్ సంక్రాంతికి కూడా ఫుల్‌ అండ్‌ ఫుల్‌ కడుపుబ్బ నవ్వులు పక్కా అని ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇటు గత కొన్ని సంక్రాంతులకు సందడి చేసిన కింగ్‌ కూడా నెక్స్ట్ సినిమాను డిసెంబర్‌కిగానీ, వచ్చే సంక్రాంతికిగానీ రంగంలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. సోగ్గాడు స్పెషల్‌ మూవీతో దిగితే మేం పండగ చేసుకుంటామంటోంది అక్కినేని సైన్యం. నందమూరి అందగాడు బాలయ్య కూడా వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఉంటానని హింట్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ చేస్తున్న గోపీచంద్‌ మూవీని ఈ ఏడాదే రిలీజ్‌ చేసి, వచ్చే సంక్రాంతికి కొరటాల సినిమాలను విడుదల చేయాలనే ప్లానింగ్‌లో ఉన్నారట. ఆల్రెడీ సిల్వర్‌స్క్రీన్‌ మీద భార్యాభర్తలుగా మెప్పించిన బాలయ్య – విద్యాబాలన్‌, కొరటాల కోసం మరోసారి సెట్స్ లో జాయిన్‌ అవుతారన్నది న్యూస్‌. వీళ్లే వచ్చినా.. వీళ్లతో పాటు డార్లింగ్‌ అండ్‌ అదర్స్ వచ్చినా.. మనవాళ్లకే థియేటర్లు సర్దుబాటుచేసుకోలేని పరిస్థితి ఉంటుంది పండగ సీజన్లో. అలాంటి పొంగల్‌ టైమ్‌లో రజనీకాంత్‌ కూడా వస్తానంటే ఎలా? జైలర్‌ తర్వాత చేయబోయే సినిమాను పొంగల్‌ బరిలో దించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. రజనీ సినిమాలంటే మన దగ్గర కూడా క్రేజ్‌ ఉంటుంది. అయినా సరే, పండగ టైమ్‌లో అయినా లోకల్‌ మూవీస్‌కి ప్రాముఖ్యతనిచ్చి, పొరుగు సినిమాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు క్రిటిక్స్. ముందు మనం.. తర్వాతే ఎవరైనా అనే ఫార్ములా 2027 పొంగల్‌ సీజన్‌లో అయినా అమలవుతుందా?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరోయిన్లపై ఆ ప్రభావం పడదా ?? వీరి భవిష్యత్తుకు ఆ నెల కీలకం

NTR: తారక్ బర్త్ డేకు మతిపోయే సర్‌ప్రైజ్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..

ఇన్‌స్టాగ్రామ్ షాక్.. స్టార్స్‌కు మాస్టర్ స్ట్రోక్

వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా

Follow Us