NTR: తారక్ బర్త్ డేకు మతిపోయే సర్‌ప్రైజ్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) ఈసారి అభిమానులకు పండగే! ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ 31 సినిమా టీజర్ విడుదల చేయనున్నారు. అంతేకాకుండా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ చేయబోయే కొత్త సినిమా మోషన్ పోస్టర్ కూడా అదే రోజు రాబోతోంది. ఇది అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్. తారక్ బర్త్‌డే వేడుకలు భారీ అంచనాలతో నిండి ఉన్నాయి.
చూస్తుంటే ఈసారి జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే మామూలుగా ఉండేలా లేదు. అభిమానులకి ఊహించని సర్‌ప్రైజులు చాలానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఎలాగూ ప్రశాంత్ నీల్ సినిమా టీజర్ విడుదల చేస్తామని ఇప్పటికే మాట ఇచ్చారు.. కానీ దాంతోపాటు మరో మేజర్ సర్‌ప్రైజ్ ప్యాకేజ్ ఒకటి వేచి చూస్తుంది. మరి ఏంటది..? ఇంతకీ తారక్ బర్త్ డే ఎలా ఉండబోతుంది..? దేవర తర్వాత ఎన్టీఆర్ నుంచి మరో తెలుగు సినిమా రాలేదు.. వార్ 2 వచ్చినా దాన్ని డైరెక్ట్ సినిమాలా అభిమానులు లెక్కేయలేదు. అందుకే దాని ఫలితం కూడా వాళ్లను పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలన్నీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌పైనే ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్ వేగంగానే జరుగుతుంది. రిలీజ్ మాత్రం 2027, జూన్ 11న ఫిక్స్ చేసారు మేకర్స్. సినిమా రిలీజ్‌కి మరో ఏడాదికి పైగానే టైమ్ ఉండటంతో.. ఆలోపు మే 20న తారక్ పుట్టిన రోజు కానుకగా టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ ఒక్క టీజర్‌తో హైప్ ఆకాశానికి పెంచేయాలని ఫిక్స్ అయిపోయారు నీల్. ఇదొక్కటే కాదు.. అన్నీ కుదిర్తే అదేరోజు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన మేజర్ సర్‌ప్రైజ్ రాబోతుందని తెలుస్తుంది. అరవింద సమేత తర్వాత తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గతంలోనే సినిమా ప్రకటించినా.. అది పట్టాలెక్కలేదు. తాజాగా అల్లు అర్జున్‌తో ప్లాన్ చేసిన గాడ్ ఆఫ్ వార్‌ను ఎన్టీఆర్ వైపు మళ్లిస్తున్నారు గురూజీ. ఈ సినిమా మోషన్ పోస్టర్ మే 20న ప్లాన్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ సారి ఎన్టీఆర్ పుట్టినరోజున డబుల్ ట్రీట్ ఉండబోతుందన్నమాట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
ఇన్‌స్టాగ్రామ్ షాక్.. స్టార్స్‌కు మాస్టర్ స్ట్రోక్
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసుకుని తిన్నారు.. ఆ తర్వాత..
మతిమరుపు… గుండెజబ్బుకు సంకేతమా ?? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు !!
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.

