రేస్‌లో వెనకబడుతున్న నభా నాటేష్ .. స్వయంభు పైనే ఆశలు

Rajeev 

09 May  2026

instagram

అందాల భామ నాభ నటేష్.. సాలిడ్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంది. వరుస సినిమాలతో ఈ అమ్మడు దూసుకుపోతుంది. 

నన్నుదోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా నాభ నటేష్ ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. 

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకుంది నాభ నటేష్. దాంతో ఈ భామ దూసుకుపోతుందని అనుకున్నారు. 

కానీ అలా జరగలేదు.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నాభ నటేష్ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. 

ఈ క్రమంలోనే ఓ ప్రమాదానికి గురయ్యే.. సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కాగా ఇప్పుడు కోలుకొని వరుసగా సినిమాలు చేస్తుంది. 

ఆ మధ్య డార్లింగ్ అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు నిఖిల్ సినిమాతో రాబోతుంది. 

నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు అనే సినిమా పైనే ఆశలు పెట్టుకుంది నాభ నటేష్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.