Rice Pancakes: అన్నం మిగిలిపోయిందా.. ఇలా స్పాంజీ కేక్స్ చేసేయండి..

ఎంత ఖచ్చితంగా కొలత పెట్టి వండినా ఇంట్లో అన్నం ఎంతో కొంత మిగిలిపోతుంది. రోజూ మిగలకపోయినా.. అప్పుడప్పుడూ మిగలడం కామన్ విషయం. ఉదయం వండిన అన్నం మిగిలితే రాత్రి తినవచ్చు. మరి రాత్రి వండి అన్నాన్ని ఉదయం తినాలంటే.. ఎవరైనా సరే పెద్దగా ఆసక్తి చూపించారు. దీంతో చాలా మంది అయితే పులిహోర లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్, కర్డ్ రైస్ కింద చేస్తారు. కానీ ఇలా ఒక్కసారి అన్నంతో దూదిలా ఉండే ప్యాన్ కేక్స్ తయారు చేయడం. రుచి వేరే లెవల్ అని..

Rice Pancakes: అన్నం మిగిలిపోయిందా.. ఇలా స్పాంజీ కేక్స్ చేసేయండి..
Rice Pancakes
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2024 | 9:54 PM

ఎంత ఖచ్చితంగా కొలత పెట్టి వండినా ఇంట్లో అన్నం ఎంతో కొంత మిగిలిపోతుంది. రోజూ మిగలకపోయినా.. అప్పుడప్పుడూ మిగలడం కామన్ విషయం. ఉదయం వండిన అన్నం మిగిలితే రాత్రి తినవచ్చు. మరి రాత్రి వండి అన్నాన్ని ఉదయం తినాలంటే.. ఎవరైనా సరే పెద్దగా ఆసక్తి చూపించారు. దీంతో చాలా మంది అయితే పులిహోర లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్, కర్డ్ రైస్ కింద చేస్తారు. కానీ ఇలా ఒక్కసారి అన్నంతో దూదిలా ఉండే ప్యాన్ కేక్స్ తయారు చేయడం. రుచి వేరే లెవల్ అని చెప్పొచ్చు. అంత రుచిగా ఉంటాయి. పిల్లలకు పెద్దలకు కూడా బాగా నచ్చుతాయి. వీటిని తక్కు సమయంలోనే తయారు చేయవచ్చు. మరి ఈ రైస్ ప్యాన్ కేక్స్‌ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రైస్ ప్యాన్ కేక్స్‌కి కావాల్సిన పదార్థాలు:

మిగిలిన అన్నం, గోధుమ పిండి, శనగ పిండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్, ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, పసుపు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర తరుగు, ఆయిల్ లేదా బటర్.

రైస్ ప్యాన్ కేక్స్‌ తయారీ విధానం:

ముందుగా అన్నాన్ని తీసుకుని దీన్ని మెత్తగా పిసకాలి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఉల్లి, పచ్చి మిర్చి ముక్కలు, గోధుమ పిండి, శనగ పిండి, ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, పసుపు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ అరగంట పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఓ పాన్ తీసుకుని బటర్ లేదా ఆయిల్ వేసి వేడి చేయాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు పక్కన పెట్టిన రైస్ మిశ్రమాన్ని ప్యాన్ కేక్స్‌లా వేసుకోవాలి. సాధారణ దోశల కంటే కాస్త మందంగా వేసుకోవాలి. వీటిని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రైస్ ప్యాన్ కేక్స్ సిద్ధం. ఇవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. వీటిని గ్రీన్ చట్నీ, ఆవకాయ, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.