Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TATA Group: నోయెల్ టాటా కోడలు మాన్సీ ఎవరు? రూ.13 వేల కోట్ల కంపెనీకి వైస్ చైర్‌పర్సన్!

కిర్లోస్కర్ గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌లో భారతదేశంలోకి ప్రవేశించింది. టయోటా మోటార్ కార్పొరేషన్ 89% వాటాలను కలిగి ఉంది. అలాగేమిగిలిన 11% కిర్లోస్కర్ గ్రూప్‌లో ఉంది. టయోటా కొన్ని ప్రసిద్ధ వాహనాల్లో ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్..

TATA Group: నోయెల్ టాటా కోడలు మాన్సీ ఎవరు? రూ.13 వేల కోట్ల కంపెనీకి వైస్ చైర్‌పర్సన్!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 18, 2024 | 9:40 PM

నోయెల్ టాటా టాటా చైర్మన్‌ నియామకం తర్వాత అతని కుటుంబం వార్తల్లో నిలుస్తోంది. రతన్ టాటా మరణానంతరం నోయెల్ టాటా వారసుడిగా నియమితులయ్యారు. టాటా ట్రస్ట్‌కు చైర్మన్‌గా నియమితులయ్యారు. టాటా గ్రూప్ టాటా ట్రస్ట్ యాజమాన్యంలో ఉంది. అటువంటి పరిస్థితిలో టాటా ట్రస్ట్ బాధ్యత పొందిన తర్వాత ప్రజలు నోయెల్ టాటా, అతని కుటుంబం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చాలా మంది. నోయెల్‌ టాటా కుటుంబం నుండి ఒక పేరు వినిపిస్తోంది. అదే అతని కోడలు మాన్సీ టాటా కిర్లోస్కర్. ఆమె కార్ కంపెనీ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇది ఆమె తండ్రి కంపెనీ.

మాన్సీ కిర్లోస్కర్ ఎవరు?

మాన్సీ కిర్లోస్కర్ నోయెల్ టాటా ఏకైక కుమారుడు నోయిల్ టాటా భార్య. నెవిల్లే టాటా 2019లో మానసి కిర్లోస్కర్‌ను వివాహం చేసుకున్నారు. ముంబైలోని రతన్ టాటా ఇంట్లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆమె విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె. ఆమె తల్లి గీతాంజలి కిర్లోస్కర్. కిర్లోస్కర్ గ్రూప్ కింద అనేక కంపెనీలు ఉన్నాయి. ఇందులో టయోటా మోటార్స్ కూడా ఉన్నాయి. ఇది జపాన్‌కు చెందిన టయోటా, కిర్లోస్కర్‌ల జాయింట్ వెంచర్.

ఇవి కూడా చదవండి

మాన్సీ కిర్లోస్కర్ ఏం చేస్తారు?

మాన్సీ తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ 2023లో మరణించారు. దీని తర్వాత మాన్సీ కిర్లోస్కర్ గ్రూప్‌లో చేరారు. కంపెనీని టేకోవర్ చేయడానికి ముందుకు వచ్చారు. మాన్సీ కిర్లోస్కర్ టయోటా కిర్లోస్కర్ ఆటో విడిభాగాలు, టయోటా కిర్లోస్కర్ మోటార్ బాధ్యతలను కలిగి ఉంది. మాన్సీ రెండు టాటా కిర్లోస్కర్ కంపెనీలకు వైస్ చైర్‌పర్సన్. కిర్లోస్కర్ టొయోటా టెక్స్‌టైల్, టయోటా ఇంజిన్ లిమిటెడ్, డెన్సో కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, టయోటా మెటీరియల్ హ్యాండ్లింగ్ వంటి ఈ గ్రూప్‌లోని అనేక ఇతర కంపెనీలలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె యంగ్ బిజినెస్ ఛాంపియన్ అవార్డును కూడా అందుకున్నారు.

మాన్సీ టాటా కిర్లోస్కర్ ఎంత వరకు చదువుకున్నారు?

మాన్సీ అమెరికాలోని ప్రసిద్ధ రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి ఫైన్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేట్ చేశారు. కళతో పాటు, ఆమె ప్రయాణం అంటే ఇష్టం. ఆర్ట్ కమ్యూనిటీలో మాన్సీకి చాలా గౌరవం ఉంది. మాన్సీ కిర్లోస్కర్ ఆగస్టు 7, 1990న జన్మించారు.

ఇది కూడా చదవండి: Jio: జియో నుంచి దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.101 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ డేటా!

కోట్ల విలువైన టయోటా మోటార్ కార్పొరేషన్:

1997లో కిర్లోస్కర్ గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌లో భారతదేశంలోకి ప్రవేశించింది. టయోటా మోటార్ కార్పొరేషన్ 89% వాటాలను కలిగి ఉంది. అలాగేమిగిలిన 11% కిర్లోస్కర్ గ్రూప్‌లో ఉంది. టయోటా కొన్ని ప్రసిద్ధ వాహనాల్లో ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్, లెజెండర్ ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ మార్కెట్ క్యాప్ రూ. 13000 కోట్ల కంటే ఎక్కువ.

Manasi Kirloskar1

ఇది కూడా చదవండి: Ratan TATA: రతన్ టాటా వ్యక్తిగత ఆస్తి ఎవరికి? తన చివరి కోరిక తీర్చే బాధ్యత ఆ నలుగురిదే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి