AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio: జియో నుంచి దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.101 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ డేటా!

జియో ఇటీవల తన కోట్లాది మంది కస్టమర్ల కోసం రూ.101 గొప్ప ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ చౌక ప్లాన్‌లో కంపెనీ ఎటువంటి పరిమితి లేకుండా వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను అందిస్తోంది. ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ ప్లాన్లలో భాగంగా దీన్ని తీసుకొచ్చింది..

Jio: జియో నుంచి దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.101 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ డేటా!
Subhash Goud
|

Updated on: Oct 18, 2024 | 7:03 PM

Share

రిలయన్స్ జియో దేశంలోనే నంబర్ వన్ టెలికాం కంపెనీ. దాదాపు రెండేళ్ల తర్వాత జూలై నెలలో జియో తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచింది. జియో తన రీఛార్జ్ ప్లాన్‌లలో అనేక ఆఫర్‌లను ఇస్తుంది. అందుకే ఖరీదైన ప్లాన్‌లు ఉన్నప్పటికీ, ఈ రోజు కంపెనీ టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థ. 49 కోట్ల మంది కస్టమర్లతో జియో నంబర్ వన్ స్థానంలో ఉంది. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో జియో సిమ్ కలిగి ఉంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

వివిధ అవసరాల కోసం జియో జాబితాలో వేర్వేరు ప్లాన్‌లు ఉన్నాయి. వినోదం కోసం ప్రత్యేక ప్లాన్‌లు, డేటా బూస్టర్‌ల కోసం ప్రత్యేక ప్లాన్‌లు, ఓటీటీ కంటెంట్‌ కోసం ప్రత్యేక ప్లాన్‌లు ఉన్నాయి. అదేవిధంగా జియో కూడా కొన్ని గొప్ప డేటా ప్యాక్‌లను కలిగి ఉంది. కంపెనీ జాబితాలో ఒక ప్లాన్ ఉంది. దీనిలో మీరు దాదాపు రూ.100 ఖర్చు చేయడం ద్వారా అపరిమిత డేటాను పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Tata Sumo: టాటా కారుకు ‘సుమో’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? అతనికి గౌరవం ఇచ్చిన రతన్‌ టాటా!

ఇవి కూడా చదవండి

జియో ఇటీవల తన కోట్లాది మంది కస్టమర్ల కోసం రూ.101 గొప్ప ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ చౌక ప్లాన్‌లో కంపెనీ ఎటువంటి పరిమితి లేకుండా వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను అందిస్తోంది. ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ ప్లాన్లలో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. ఇది కేవలం ఒక డేటా ప్యాక్ మాత్రమే. ఈ డేటా ప్యాక్‌కి “ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ + 6GB” అని పేరు పెట్టారు.

ఈ ప్యాక్ బెనిఫిట్స్ అందుకోవాలంటే ముందుగా డైలీ 1GB, 28 రోజుల వ్యాలిడిటీ అందించే ఒక బేస్ ప్లాన్‌కు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే రోజూ 1.5GB డేటా, 28-56 రోజుల వ్యాలిడిటీ కలిగిన యాక్టివ్‌ ప్లాన్‌ ఉండాలి. ఈ మూడింటిలో ఏ వ్యాలిడిటీ ప్లాన్ యాక్టివ్‌లో ఉన్నా వారు రూ.101 ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ + 6GB ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది 6జీబీ 4జీ డేటా ఆఫర్ చేస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్ డేటా అందిస్తుంది.

జియో ఇంతకు ముందు రూ.51కే అపరిమిత 5జీ డేటా అందించే అప్‌గ్రేడ్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇది 3GB 4G డేటా కూడా అందిస్తుంది. రోజు 1.5GB డేటా, 28 డేస్ వ్యాలిడిటీ కలిగిన సింగిల్ ప్యాకేజీతో మాత్రమే దాన్ని అందించింది. అంటే దీని వ్యాలిడిటీ గరిష్టంగా ఒక నెల మాత్రమే ఉంటుంది. కొత్త ప్లాన్ మాత్రం దాదాపు రెండు నెలల పాటు అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్ ఇస్తుంది.

ఇది కూడా చదవండి: Ratan TATA: రతన్ టాటా వ్యక్తిగత ఆస్తి ఎవరికి? తన చివరి కోరిక తీర్చే బాధ్యత ఆ నలుగురిదే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి