Tata Sumo: టాటా కారుకు ‘సుమో’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? అతనికి గౌరవం ఇచ్చిన రతన్‌ టాటా!

రతన్‌ టాటా మరణాన్ని దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే టాటా వాహనాలకు ప్రజల్లో ఎంతో గుర్తింపు ఉంది. టాటా సుమో పేరు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ టాటా సుమో అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Tata Sumo: టాటా కారుకు ‘సుమో’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? అతనికి గౌరవం ఇచ్చిన రతన్‌ టాటా!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 17, 2024 | 6:12 PM

భారతీయ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇటీవల మరణించారు. ఆయన మృతి షాక్ నుంచి దేశం ఇంకా తేరుకోలేదు. కానీ రతన్ టాటా మాత్రమే కాదు, అంతకు ముందు చైర్మన్ అయిన వారు దేశానికి, సమాజానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఒకప్పుడు భారత ఆటో మార్కెట్‌ను శాసించిన టాటా సుమో కారుకు ఈ పేరు ఎలా వచ్చింది? సుమో పేరు జపనీస్ అని అనుకోవచ్చు. అయితే సుమోకు జపాన్‌కు ఎలాంటి సంబంధం లేదు. మరాఠీ వ్యక్తికి టాటా గ్రూప్ ఇచ్చిన గౌరవం ఇది. ఆ మరాఠీ వ్యక్తి పద్మ భూషణ్ సుమంత్ మూల్గావ్కర్. అతని పేరు మొదటి అక్షరాలతో సుమో అని పేరు పెట్టారు. టెల్కో, టాటా మోటార్స్ నిర్మాణానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.

సుమంత్ మూల్గావ్కర్ ఎవరు?

సుమంత్ మూల్గావ్కర్ 5 మార్చి 1906న ముంబైలో జన్మించారు. అతను ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ నుండి ఇంజనీరింగ్ చదివాడు. ఆ సమయంలో సుమంత్ మూల్గాంకర్ ఏసీసీ సిమెంట్‌లో పనిచేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం

సుమంత్ మూల్గావ్కర్ 1949లో టాటా టాటా ఇంజినీరింగ్, లోకోమోటివ్ కంపెనీ అంటే టెల్కోలో ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా చేరారు. 1954లో అతను టాటా ట్రక్కుల తయారీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించాడు. 1966లో టెల్కో ప్రాజెక్ట్ ఏర్పాటు అయ్యింది. వారు టాటా ట్రక్కులకు గణనీయమైన మెరుగుదల చేశారు. అందుకే ఈ ట్రక్కులు కస్టమర్లకు ప్రాధాన్యతనిచ్చాయి. టాటా స్టీల్ వైస్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 1990లో అతని సేవలకు భారత ప్రభుత్వంచే మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను పొందారు.

రతన్ టాటా పెట్టిన సుమో పేరు

సుమంత్ మూల్గావ్కర్ 1 జూలై 1989న మరణించారు. అయితే టాటా గ్రూప్ ఆయనను మరిచిపోలేదు. 1994లో టాటా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కారు విడుదలైంది. ఆ తర్వాత ఆ కారుకు రతన్ టాటా అతనిపేరు పెట్టారు. అతని పేరులో మొదటి అక్షరం, ఇంటి పేరు మొదటి అక్షరాలతో కారుకు సుమో అని పేరు పెట్టారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే