Aadhaar Update: ఆన్‌లైన్‌లో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా? వెరి సింపుల్‌!

ప్రతి ఒక్కరికి ఆధార్‌ కార్డు ఎంతో ముఖ్యం. ఈ కార్డు లేనిది ఏ పని జరగని పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్‌ కార్డు ఎంతో ముఖ్యం. ఆధార్‌ నంబర్‌ ద్వారా వ్యక్తి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆధార్‌ కార్డులోని వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం ముఖ్యం. పదేళ్ల కిందట తీసుకున్న ఆధార్‌ కార్డులో వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Aadhaar Update: ఆన్‌లైన్‌లో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా? వెరి సింపుల్‌!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 18, 2024 | 4:10 PM

ఆధార్‌ కార్డు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఈ ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. సిమ్‌ కార్డు నుంచి బ్యాంకు ఖాతా తెరవడం నుంచి ఆధార్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. అప్పుడు ఆధార్‌లోని వివరాలు అప్‌డేట్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఆధార్‌ తీసుకుని పదేళ్లు అవుతున్నట్లయితే అందులోని వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగానే మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడం ఎలా?:

– ముందుగా UIDAI పోర్టల్‌ని సందర్శించండి. myaadhaar.uidai.gov.inని సందర్శించడం ద్వారా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకునే ఆప్షన్‌లోకి వెళ్లండి.

– ఆధార్, ఓటీపీతో లాగిన్ చేయండి. లాగిన్ చేయడానికి మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీనీ నమోదు చేయండి.

-మీ వివరాలను తనిఖీ చేసి మీ ఆధార్ ప్రొఫైల్‌లో చూపిన జనాభా సమాచారాన్ని (పేరు, చిరునామా మొదలైనవి) తనిఖీ చేయండి. ఏవైనా వివరాలు గడువు ముగిసినవి లేదా తప్పుగా ఉన్నట్లయితే వాటిని అప్‌డేట్‌ చేయండి.

-మీ వివరాలను అప్‌డేట్ చేయడానికి సంబంధిత డాక్యుమెంట్ కేటగిరిని (ఐడెంటిటీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్) ఎంచుకోండి. స్కాన్ చేసిన కాపీని JPEG, PNG లేదా PDF ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి. ఇమేజ్‌ 2 ఎంబీ వరకు ఉండాలి.

-మీరు మీ అభ్యర్థనను సమర్పించిన తర్వాత మీకు సర్వీస్‌ అభ్యర్థన సంఖ్య (SRN) అందుతుంది. ఇది మీ అప్‌డేట్ స్థితిని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.

-బయోమెట్రిక్ అప్‌డేట్‌లను గుర్తుంచుకోండి. జనాభా సంబంధిత అప్‌డేట్‌లను ఆన్‌లైన్‌లో చేయవచ్చు, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు లేదా ఫోటోలు వంటి బయోమెట్రిక్ సమాచారానికి మార్పులు ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు వీలుండదు. కేవలం ఆధార్‌ సెంటర్‌లో మాత్రమే చేయించాల్సి ఉంటుంది. ఇందు కోసం కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..