AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Custard Apple Rabdi: సీతా ఫలంతో ఇలా రబ్డీ చేయండి.. తిన్నవాళ్లు మైమరచిపోతారు..

పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. ఇది సీజనల్ ఫ్రూట్. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిన పండ్లలో ఇది ఒకటి. సీతాఫలం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీర ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఇందులో లభిస్తాయి. ఇది తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. సీతా ఫలం తినడం వల్ల పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఇంత రుచిగా ఉండే సీతా ఫలంతో రబ్డీ చేస్తే.. ఆహా ఆ రుచే వేరు. రబ్డీ రుచి గురించి చెప్పేది ఏముంది. చాలా మంది దీనికి ఫ్యాన్స్..

Custard Apple Rabdi: సీతా ఫలంతో ఇలా రబ్డీ చేయండి.. తిన్నవాళ్లు మైమరచిపోతారు..
Custard Apple Rabdi
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 18, 2024 | 9:54 PM

Share

పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. ఇది సీజనల్ ఫ్రూట్. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిన పండ్లలో ఇది ఒకటి. సీతాఫలం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీర ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఇందులో లభిస్తాయి. ఇది తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. సీతా ఫలం తినడం వల్ల పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఇంత రుచిగా ఉండే సీతా ఫలంతో రబ్డీ చేస్తే.. ఆహా ఆ రుచే వేరు. రబ్డీ రుచి గురించి చెప్పేది ఏముంది. చాలా మంది దీనికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి రబ్డీలో సీతా ఫలం కలిపితే ఆ రుచి మరింత పెరుగుతుంది. అలాగే చాలా త్వరగా అయిపోతుంది. మరి ఇంత రుచిగా ఉండే సీతా ఫలం రబ్డీని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సీతా ఫలం రబ్డీకి కావాల్సిన పదార్థాలు:

సీతా ఫలం గుజ్జు, పాలు, తేనె లేదంటే బెల్లం, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స తరుగు, గులాబీ రేకులు.

సీతా ఫలం రబ్డీ తయారీ విధానం:

ముందుగా పాలను ఓ గిన్నెలో వేసి చక్కగా అయ్యేంత వరకు మరగ బెట్టుకోవాలి. మూడు సార్లు ఉడుకు వచ్చాక మంట తగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు సగానికి ఇంకిపోయి.. చిక్కబడ్డాక యాలకుల పొడి, బెల్లం లేదా పంచదార లేదంటే తేనె కూడా కలుపుకోవచ్చు. ఆ తర్వాత సీతా ఫలం గుజ్జు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగాక.. మరో ఐదు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

చివరగా పైన గులాబీ రేకులు, డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలి. సిల్వర్ వార్క్‌తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ఈ స్వీట్‌ని ఇలా వేడిగా ఉన్నప్పుడు తినొచ్చు.. లేదంటే ఫ్రిజ్‌లో పెట్టి కూల్‌గా ఉన్నప్పుడు తిన్నా రుచిగానే ఉంటుంది. అంతే ఎంతో రుచిగా ఉండే సీతా ఫల్ రబ్డీ సిద్ధం. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..