1000 వీసాలకు 40 వేలమంది దరఖాస్తు..

1000 వీసాలకు 40 వేలమంది దరఖాస్తు..

Phani CH

|

Updated on: Oct 18, 2024 | 1:34 PM

ఇటీవ‌ల భారతీయుల కోసం ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన వర్కింగ్‌ హాలిడే మేకర్‌ వీసా కార్యక్రమానికి భారీ స్పందన వస్తోంది. ఈ ప్రోగ్రామ్ కింద తొలి విడతలో 1000 వీసాలను అందుబాటులో ఉంచింది. దీనికి అక్టోబరు 1 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే, కేవలం రెండు వారాల్లోనే 40 వేల మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ శాఖ సహాయమంత్రి వెల్లడించారు. వర్కింగ్ హాలీడే వీసా పొందినవారు ఆస్ట్రేలియాలో 12 నెలల పాటు ఉండొచ్చు. ఆ సమయంలో ఉద్యోగం లేదా చదువుకోవడానికి, లేదా నివాసం ఉండటానికి వారిని అనుమతిస్తారు. ఈ వీసా కోసం వయో పరిమితిని 18-30 ఏళ్లుగా నిర్ణయించారు. వీసా పొందిన వారు వచ్చే ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాకు వెళ్లొచ్చు. తొలి స్పాట్లకు మరో రెండు వారాలు సమయం ఉండటంతో మరింత మంది రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్టోబర్ 14 – ఏప్రిల్ 30 2025 మధ్య ర్యాండమ్‌గా ఎంపిక ప్రక్రియ చేపడతారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది కొండా.. గుమ్మడి పండా !! సైజ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

ఈ స్టార్ క్రికెటర్ కూతురిని చూస్తే.. మతి పోవాల్సిందే

నాని అక్కను చూసి ఇలా ఉందని అనుకునేరు.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది !!

తెలంగాణలో విరబూసిన కుంకుమ పువ్వు

ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే.. మూడో ప్రపంచ యుద్ధమేనా ??