ఇది కొండా.. గుమ్మడి పండా !! సైజ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
సాధారణంగా గుమ్మడికాయ ఎంత సైజుంటుంది? మహా అంటే ఓ 20 కిలోలు బరువుండే గుమ్మడికాయ కాస్త పెద్దగానే ఉంటుంది. ఆ మధ్య బాహుబలి గుమ్మడికాయలనీ చాలానే నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు మనం చూడబోయే గుమ్మడికాయ బాహుబలి కాదు అంతకు మించి అన్నట్టుగా ఉంది. ఏకంగా ఆ గుమ్మడికాయను చూస్తే ఓ చిన్న పర్వతాన్ని తలపిస్తోంది. దానిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఈ గుమ్మడికాయను అమెరికాలో ఓ టీచర్ పండించాడు. మనం ఓ 20 లేదా 30 కిలోలు ఉండే గుమ్మడికాయను చూసి అబ్బో అనుకుంటాం. కానీ అమెరికన్లు అలా అనుకోరు. వారికి అది చాలా సహజంగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు పెద్ద పెద్ద గుమ్మడికాయలను పండించి రికార్డులు సృష్టిస్తారు. ఇందుకోసం ప్రపంచ ఛాంపియన్ షిప్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇటీవలే దక్షిణ శాన్ ఫ్రాన్సిస్కోలోని హఫ్‌మూన్ బేలో 51వ వరల్డ్ ఛాంపియన్ షిప్ పంప్‌కిన్ వేఆఫ్ జరిగింది. దీనిలో ట్రావిస్ జింజర్ అనే హార్టీకల్చర్ టీచర్ విజేతగా నిలిచారు. ఆయన పండించి తెచ్చిన గుమ్మడికాయ బరువెంతో తెలుసా.. అక్షరాలా 1,121 కిలోలు. ప్రత్యర్థి పండించిన గుమ్మడికాయ కంటే దాదాపు మూడు కిలోలు అదనంగా ఉండటంతో విజేతగా నిలిచారు. ప్రపంచ రికార్డు సాధించిన 1,247 కిలోల గుమ్మడి కంటే కేవలం 126 కిలోలే తక్కువ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ స్టార్ క్రికెటర్ కూతురిని చూస్తే.. మతి పోవాల్సిందే
నాని అక్కను చూసి ఇలా ఉందని అనుకునేరు.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది !!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

