నాని అక్కను చూసి ఇలా ఉందని అనుకునేరు.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది !!
హీరో నాని, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ సరిపోదా శనివారం. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా నానికి ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ అందించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని.. సూర్య అనే పాత్రలో జీవించేశాడు.
ఇక ఇందులో నానికి అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా.? అతడి అక్క పాత్రలో ఆమె చక్కని అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరో.. బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే.. మీరు షాకవుతారు. ఆ నటి మరెవరో కాదు.. తమిళ హీరోయిన్ అదితి బాలన్. అరువి అనే చిత్రంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. మొదటి చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఆమె నటనకు గానూ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత కుట్టీ స్టోరీతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వచ్చిన కోల్డ్ కేస్ చిత్రంలో నటించింది. అలాగే నివిన్ పౌలీ పదవెట్టు చిత్రంలోనూ మెరిసింది ఈ భామ. ఇక తెలుగులో సమంతా ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంలో.. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. లేటెస్ట్‌గా ఈ ఏడాదిలోనే రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ మూవీలోనూ అమ్మడు మెరిసింది. ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. మూడు ఇండస్ట్రీలలోనూ సక్సెస్ రేట్ ఎక్కువేనని చెప్పాలి. అదితి బాలన్.. కేవలం నటి మాత్రమే కాదు.. డ్యాన్సర్, మోడల్, లాయర్ కూడా. సినిమాలే కాకుండా ‘నవరస’, ‘స్టోరీ ఆఫ్ థింగ్స్’ అనే రెండు వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అదితి బాలన్.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తూ.. నెట్టింట కూడా వైరల్ అవుతుంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

