రూ.రెండు వేల కోట్లా !! ఏంటి అంత సీన్ ఉందంటారా ??
ఒకప్పుడు సినిమా 100 కోట్లు రాబట్టడమనేది చాలా పెద్ద విషయమే. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సినిమాలు కేవలం రెండు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేస్తున్నాయి. ప్రతి స్టార్ నటుడి సినిమాలు కూడా ఈజీగా 500 కోట్లు రాబడుతున్నాయి. ఇక హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్లు కూడా వస్తున్నాయి. అయితే ఓ తమిళ భారీ బడ్జెట్ నిర్మాత మాత్రం తన సినిమా రిలీజ్ కు ముందే ఎంత వసూళ్లు రాబట్టగలదో అంచనా వేశారు.
రెండు వేల కోట్లు పక్కా అంటున్నారు. తమిళ స్టార్ నటుడు సూర్య నటిస్తున్న చిత్రం కంగువా. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సూర్య నటించిన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది, ఈ చిత్ర నిర్మాత కె.ఇ.జ్ఞానవేలు ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే.. తన సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు వేల కోట్లు వసూలు చేస్తుందని ఓ అంచనా వేసినట్టు చెప్పారు. జ్ఞానవేలు మాటలు విన్న నెటిజన్లు.. నిర్మాత అంచనాలు మరీ ఎక్కువయ్యాయని ఎగతాళి చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని పక్కకు పెడితే.. కంగువ మొత్తం రన్‌టైమ్ 2:26 నిమిషాలు మాత్రమే. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది.ఆయుధాలు, గుర్రపు స్వారీ మొదలైనవాటిని కనిపెట్టిన కాలం నాటి కథ ఇందులో ఉంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటాని కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, కార్తీ కూడా అతిథి పాత్రలో నటించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
UP నుంచి 1600km సైకిల్ తొక్కుకుంటూ.. బన్నీ అభిమాని డేర్ జర్నీ
టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న రవితేజ కూతురు.. ఇక దబిడి దిబిడే !!
1000 వీసాలకు 40 వేలమంది దరఖాస్తు..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

