Salman Khan: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్‌ మామూలోడు కాదు.. ఇతన్ని‌ దాటి భాయ్‌జాన్‌ను టచ్ చేయగలరా..!

కృష్ణ జింకలను వేటాడిన సల్మాన్ పై పగ తీర్చుకుంటామని బిష్ణోయ్ ముఠా తెలిపింది. అలాగే సల్మాన్‌ఖాన్‌ను చంపిన వారికి రూ. 25 లక్షల రివార్డును కూడా ప్రకటించింది ఆ ముఠా. గత ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై పలుమార్లు కాల్పులు జరిపారు.

Salman Khan: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్‌ మామూలోడు కాదు.. ఇతన్ని‌ దాటి భాయ్‌జాన్‌ను టచ్ చేయగలరా..!
Salman Khan
Follow us

|

Updated on: Oct 18, 2024 | 9:38 PM

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ ను చంపుతామని బిష్ణోయ్ గ్రూప్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. 2018లో లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ తొలిసారిగా సల్మాన్‌పై హత్య బెదిరింపులు చేసింది. కృష్ణ జింకలను వేటాడిన సల్మాన్ పై పగ తీర్చుకుంటామని బిష్ణోయ్ ముఠా తెలిపింది. అలాగే సల్మాన్‌ఖాన్‌ను చంపిన వారికి రూ. 25 లక్షల రివార్డును కూడా ప్రకటించింది ఆ ముఠా. గత ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై పలుమార్లు కాల్పులు జరిపారు. కాగా అక్టోబర్ 12 న, సల్మాన్ ఖాన్ స్నేహితుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కాల్చి చంపారు. దాంతో  బిష్ణోయ్ గ్యాంగ్-సల్మాన్ ఖాన్ సమస్య మళ్లీ వార్తల్లో నిలిచింది. బాబా సిద్ధిఖీ తన కుమారుడి కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు అతనిపై పలుమార్లు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించిన సిద్దిఖీ ప్రాణాలను కాపాడలేకపోయారు.

ఇది కూడా చదవండి : ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు

బాబా సిద్ధిఖీ మరణం తరువాత, సల్మాన్ ఖాన్ తన ఇంటి చుట్టూ భద్రతను పెంచారని అలాగే అతనిని చూడటానికి ఎవ్వరూ రావొద్దని అతని సినీ స్నేహితులను కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాలపై చర్చ జరుగుతుండగానే సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. షేరా గత 29 ఏళ్లుగా సల్మాన్ వ్యక్తిగత బాడీగార్డ్‌గా పనిచేస్తున్నారు. షేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ. అంతర్జాతీయ సెలబ్రిటీలు భారతదేశానికి వచ్చినప్పుడు షేరా వారికి రక్షణ కల్పిస్తాడు. కెనడియన్ గాయకుడు జస్టిన్ బీబర్ ముంబైలో ప్రోగ్రాం కోసం వచ్చినప్పుడు అతను బాడీగార్డ్ కూడా షేరానే. 1995లో షేరా సల్మాన్ ఖాన్‌కు బాడీగార్డ్‌గా చేరాడు. అతనికి నెలకు దాదాపు రూ.15 లక్షల జీతం వస్తుంది. అంటే ఏడాదికి దాదాపు 2 కోట్ల రూపాయలు.

ఇది కూడా చదవండి :అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!

గత ఆగస్టులో షేరా సొంత రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. మిస్టర్ ముంబై, మిస్టర్ మహారాష్ట్ర అనే బిరుదులను ఉన్న షేరా 2011లో బెస్ట్ సెక్యూరిటీ అవార్డును కూడా అందుకున్నాడు. వీటన్నింటితో పాటు అతనికి సొంత సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఉంది.

ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.