కల్తీ మద్యం కలకలం.. 27కు చేరిన మృతుల సంఖ్య.. ఆస్పత్రుల్లో హృదయ విదారక దృశ్యాలు
బిహార్ సివాన్ జిల్లాలోని మఘార్, ఔరియా గ్రామాల్లో కల్తీ మద్యం సేవించి 22 మంది, సరణ్ జిల్లాలోని ఇబ్రహీంపూర్ లో ఐదుగురు మృతి చెందారు. మరో 25 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా బాధితుల్లో చాలామంది
బిహార్‌లో కల్తీ మద్యం రక్కసి మరోసారి కోరలు చాచింది.. బిహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం సేవించి మృతి చెందిన వారి సంఖ్య 27కు చేరింది. బిహార్ సివాన్ జిల్లాలోని మఘార్, ఔరియా గ్రామాల్లో కల్తీ మద్యం సేవించి 22 మంది, సరణ్ జిల్లాలోని ఇబ్రహీంపూర్ లో ఐదుగురు మృతి చెందారు. మరో 25 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా బాధితుల్లో చాలామంది కంటిచూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆసుపత్రుల వద్ద మృతుల బంధువుల రోధనలు మిన్నంటాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos