సిల్క్ స్మిత చనిపోతే చూసేందుకు వచ్చిన ఒకే ఒక్క టాప్ హీరో ఎవరో తెలుసా..?

TV9 Network

18 October 2024

సిల్వర్ స్క్రీన్‌పై పేలిన బ్యూటీ బాంబ్ సిల్క్ స్మిత. 80వ దశకంలో ఆమె సౌత్ ఇండస్ట్రీని రూల్ చేశారు. అగ్ర కథానాయకులు ఆమె డేట్స్ కోసం ఎదురూచూసే పరిస్థితి ఉండేది అప్పట్లో.

విడుదల అవ్వని సినిమాల మేకర్స్.. ఒక్క పాటకు డేట్స్ ఎడ్జెస్ట్ చేయరూ అంటూ సిల్క్ స్మిత వెంటపడేవారు. ఆమె కళ్లలోనే ఏదో తెలియని మత్తు ఉండేది. ఆమె నిషా కళ్లు కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేశాయి.

సినిమా రంగంలో ఉవ్వెత్తిన ఎగసిన తార అయిన సిల్క్ స్మిత.. 36 ఏళ్ళకే ఆమె ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో పెను సంచలనం అయింది.

చనిపోవటానికి ముందురోజు సిల్క్ స్మిత చాలా మందికి ఫోన్ చేసినట్టు ఆ తరువాత చాలామంది ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు. తర్వాత కాలంలో ఆమె కాల్స్ ఆ రోజు ఎత్తనందుకు వారంతా బాధపడ్డారు.

అయితే ఆమె ఆఖరి చూపు చూసేందుకు అప్పటి టాప్ స్టార్స్ ఎవరూ రాకపోవడం.. ఆనాటి ఫిల్మ్ జర్నలిస్టులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

సిల్క్‌ను కడసారి చూసేందుకు వచ్చిన అప్పటి అగ్ర కథానాయకుడు.. అర్జున్ మాత్రమే. ఎవరూ పట్టించుకోకపోయినా అర్జున్ మాత్రమే రావడం హాట్ టాపిక్ అయింది.

ఇదే విషయాన్ని అర్జున్‌ను అడగ్గా.. ఒక సినిమా చిత్రీకరణ చివరి రోజు అర్జున్‌తో “నేను చచ్చిపోతే చూడ్డానికి వస్తావా”? అని అడిగిందట.

“ఛీ అదేం మాట” అని వారించాడే తప్ప సీరియస్‌గా తీసుకోలేదు. ఆ విషయాన్ని గుర్తు చేసుకొని అప్పుడు చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడట అర్జున్.