Vegetable Rice: రుచిగా తినాలి అనుకుంటే.. ఇలా వెజిటబుల్ రైస్ చేయండి..

ఎప్పుడూ ఒకేలా వంటలు తినాలంటే ఎవరికైనా బోరుగా ఉంటుంది. ఒకేలాంటివి అస్సలు తినాలని పించదు. పెద్దలకైనా.. పిల్లలకైనా అంతే. అందులోనూ ఆఫీసులు, స్కూల్లకు వెళ్లే సమయంలో మరింత హడావిడిగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఫాస్ట్‌గా, టేస్టీగా అయిపోయే వంటకం ఇది. కొత్తగా తిన్నట్టు అనిపిస్తుంది. ఈ రైస్‌ని ఒక్కసారి టేస్ట్ చేస్తే.. మళ్లీ ఇలాగే చేయమంటారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కి ఎలాగైనా..

Vegetable Rice: రుచిగా తినాలి అనుకుంటే.. ఇలా వెజిటబుల్ రైస్ చేయండి..
Mixed Vegetable Rice
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 08, 2024 | 9:53 PM

ఎప్పుడూ ఒకేలా వంటలు తినాలంటే ఎవరికైనా బోరుగా ఉంటుంది. ఒకేలాంటివి అస్సలు తినాలని పించదు. పెద్దలకైనా.. పిల్లలకైనా అంతే. అందులోనూ ఆఫీసులు, స్కూల్లకు వెళ్లే సమయంలో మరింత హడావిడిగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఫాస్ట్‌గా, టేస్టీగా అయిపోయే వంటకం ఇది. కొత్తగా తిన్నట్టు అనిపిస్తుంది. ఈ రైస్‌ని ఒక్కసారి టేస్ట్ చేస్తే.. మళ్లీ ఇలాగే చేయమంటారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కి ఎలాగైనా దీన్ని తినవచ్చు. మరి ఈ మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

బియ్యంగా, మీకు నచ్చి కూరగాయలు, క్యారెట్, ఆలూ, క్యాప్సికమ్, బటానీ, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటా, స్వీట్ కార్న్, బీన్స్, పన్నీర్ ఇలా మీకు నచ్చిన కైరగాయలు తీసుకోవచ్చు. పులావ్ సరుకులు, ఆయిల్, నెయ్యి, బియ్యం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, జీడిపప్పు.

మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్‌ తయారీ విధానం:

ముందుగా కుక్కర్ తీసుకోండి. అందులో ఆయిల్ లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక జీడిపప్పు వేసి వేయించి.. పక్కన పెట్టుకోవాలి. నెక్ట్స్ బిర్యానీ దినుసులు కొద్దిగా వేసుకోవాలి. ఇవి కాస్త వేగాక.. కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. ఇవి వేగాక కూరగాయల ముక్కలన్నీ వేసి.. చిన్న మంటపై ఓ ఐదు నుంచి 10 నిమిషాలైనా వేయించాలి. ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసి వేయించాలి.

ఇవన్నీ మగ్గాక.. బియ్యాన్ని వేసి సరిపడా నీళ్లు వేసి.. ఉప్పు రుచి చూసుకుని.. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి తగ్గాక మూత తీసి.. కొత్తి మీర చల్లి జీడిపప్పు వేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్ సిద్ధం. ఇందుకు గ్రేవీ కానీ రైతా కానీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఓన్లీ రైస్ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.