Guntur Gongura Pulao: గుంటూరు గోంగూర పులావ్ ని ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది!
గుంటూరు గోంగూర పులావ్.. వింటుంటేనే పేరే చాలా టెంప్టీగా ఉంది. అలాగే గోంగూరతో చేసే ఈ పులావ్.. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా గోంగూరతో గుంటూరు స్టైల్లో పులావ్ చేసుకుంటే.. అందిరిపోతుంది. గోంగూర పులుపుకు కాస్త కారాన్ని యాడ్ చేస్తే వేరే లెవల్ అంతే. వీకెండ్స్ లో, స్పెషల్ డేల్ ఈ పులావ్ ను చేసుకుని తినొచ్చు. ఎప్పుడూ చికెన్, మటన్ బిర్యానీలే కాకుండా.. ఇలా అప్పుడప్పుడు గోంగూరతో కూడా పులావ్ చేసుకుంటే.. కమ్మగా ఉంటుంది. ఈ పులావ్ ను తయారు చేయడం కూడా చాలా ఈజీ. తక్కువ సమయంలోనే..
గుంటూరు గోంగూర పులావ్.. వింటుంటేనే పేరే చాలా టెంప్టీగా ఉంది. అలాగే గోంగూరతో చేసే ఈ పులావ్.. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా గోంగూరతో గుంటూరు స్టైల్లో పులావ్ చేసుకుంటే.. అందిరిపోతుంది. గోంగూర పులుపుకు కాస్త కారాన్ని యాడ్ చేస్తే వేరే లెవల్ అంతే. వీకెండ్స్ లో, స్పెషల్ డేల్ ఈ పులావ్ ను చేసుకుని తినొచ్చు. ఎప్పుడూ చికెన్, మటన్ బిర్యానీలే కాకుండా.. ఇలా అప్పుడప్పుడు గోంగూరతో కూడా పులావ్ చేసుకుంటే.. కమ్మగా ఉంటుంది. ఈ పులావ్ ను తయారు చేయడం కూడా చాలా ఈజీ. తక్కువ సమయంలోనే ఇది చేసుకోవచ్చు. మరి ఈ గోంగూర పులావ్ ను ఎలా తయారు చేస్తారు? గోంగూర పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గోంగూర పులావ్ కి కావాల్సిన పదార్థాలు:
ఎర్ర గోంగూర, బాస్మతీ రైస్, నూనె, పులావ్ సరుకులు, నెయ్యి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, పుదీనా, కొత్తి మీర, కరివేపాకు, జీడి పప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, జీడి పప్పు, బిర్యానీ మసాలా పొడి.
గోంగూర పులావ్ తయారీకి విధానం:
ముందుగా ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి.. సన్నగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లి పాయ ముక్కలను నూనెలో వేసి గోల్డన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకుని పక్కకు పెట్టు కోవాలి. నెక్ట్స్ కొద్దిగా జీడి పప్పు కూడా వేయించి ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కాక.. పులావ్ సరుకులు వేసి వేయించు కోవాలి. ఇవి వేగాక కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తి మీర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ నెక్ట్స్ అల్లం పేస్ట్ వేసి వేసి కాసేపు వేగాక, టమాటా ముక్కలు వేసి.. మెత్తగా అయ్యేంత వరకూ వేయించాక.. గోంగూర వేసి కలుపుకోవాలి. మూత పెట్టి గోంగూరను కూడా మెత్తగా అయ్యేంత వరకూ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి.
గోంగూర మగ్గాక నీళ్లు, ఉప్పు వేసి బాగా కలుపు కోవాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు.. బాస్మతీ రైస్ ని శుభ్రంగా కడిగి వేయాలి. ఆతర్వాత కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పులావ్ ని ఉడికించు కోవాలి. చివరిలో ఒకసారి కొద్దిగా కొత్తి మీర, జీడి పప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి.. సర్వింగ్ ప్లేట్స్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే గుంటూరు గోంగూర పులావ్ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేసి ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి.