Egg Roast: ఎగ్స్ కట్ చేసి.. ఇలా రోస్ట్ చేసుకుంటే భలేగా ఉంటుంది!
కోడి గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి హెల్త్‌కి ఎంతో మంచి చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ప్రతి రోజూ ఉడకబెట్టిన ఓ కోడిగుడ్డ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కోడి గుడ్లతో స్నాక్స్, కర్రీస్, సూప్‌లు ఒక్కటేంటి.. ఎన్నో రకాల వంటలు చేయవచ్చు. వీటిని చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. గుడ్లతో చేసుకునే వంటల్లో ఎగ్ రోస్ట్ కూడా ఒకటి. ఈ కర్రీ కోసం ఎగ్‌ని కట్ చేసి చేస్తారు. ఈ రెసిపీ తయారు..
కోడి గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి హెల్త్‌కి ఎంతో మంచి చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ప్రతి రోజూ ఉడకబెట్టిన ఓ కోడిగుడ్డ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కోడి గుడ్లతో స్నాక్స్, కర్రీస్, సూప్‌లు ఒక్కటేంటి.. ఎన్నో రకాల వంటలు చేయవచ్చు. వీటిని చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. గుడ్లతో చేసుకునే వంటల్లో ఎగ్ రోస్ట్ కూడా ఒకటి. ఈ కర్రీ కోసం ఎగ్‌ని కట్ చేసి చేస్తారు. ఈ రెసిపీ తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో టేస్టీగా, కమ్మగా ఉంటుంది. మరి ఈ కర్రీని ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ రోస్ట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు:
కోడి గుడ్లు, ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, సోంపు గింజలు, కొత్తిమీర, కరివేపాకు, మెంతులు, మిరియాలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఆయిల్.
ఎగ్ రోస్ట్ కర్రీ తయారీ విధానం:
ముందుగా చిన్న కడాయి తీసుకుని అందులో మెంతులు వేసి వేయించాలి. ఆ తర్వాత కరివేపాకుతో పాటు మిరియాలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి మిక్సీలో.. మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. ఇది ఓ బౌల్‌లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కడాయి తీసుకుని.. అందులో సోంపు గింజలు వేసి.. వేడెక్కాక ఉల్లి పాయ, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి కలర్ మారేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ మగ్గించుకోవాలి. నెక్ట్స్ కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించుకోవాలి.
ఆ తర్వాత మసాలా పొడి వేసి ఒక నిమిషం వేయించి.. నీళ్లు పోసి.. ఆయిల్ పైకి తేలేంత వరకూ ఉడికించాలి. ఆయిల్ పైకి తేలాక.. ఉడికించుకున్న గుడ్లను సగం వరకూ కట్ చేసి.. కర్రీలో వేసి ఓ రెండు నిమిషాలు చిన్న మంట మీద మూత పెట్టి.. ఉడికించాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకే వేసి ఒకసారి కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దీన్ని అన్నం, చపాతీ, రోటీలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది.