Chilli Maggi Masala: చిల్లీ మ్యాగీ మసాలా.. స్పైసీ లవర్స్‌కి బాగా నచ్చుతుంది..

మ్యాగీ అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మ్యాగీని జస్ట్ రెండు నిమిషాల్లో.. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఇలానే చేస్తే కోత్త రుచి ఏముంటుంది. ఒక్కోసారి ఒక్కోలా ట్రై చేస్తే రుచి ఏంటో తెలుస్తుంది. మ్యాగీతో వెజిటేబుల్స్ జోడించి చేస్తే ఆహా రుచి వేరే లెవల్‌లో ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా చేసుకోవడం చాలా మందికి ఇష్టం. అయితే ఈ మ్యాగీతోనే మసాలా యాడ్ చేస్తే వావ్..

Chilli Maggi Masala: చిల్లీ మ్యాగీ మసాలా.. స్పైసీ లవర్స్‌కి బాగా నచ్చుతుంది..
Chilli Maggi Masala
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2024 | 10:00 PM

మ్యాగీ అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మ్యాగీని జస్ట్ రెండు నిమిషాల్లో.. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఇలానే చేస్తే కోత్త రుచి ఏముంటుంది. ఒక్కోసారి ఒక్కోలా ట్రై చేస్తే రుచి ఏంటో తెలుస్తుంది. మ్యాగీతో వెజిటేబుల్స్ జోడించి చేస్తే ఆహా రుచి వేరే లెవల్‌లో ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా చేసుకోవడం చాలా మందికి ఇష్టం. అయితే ఈ మ్యాగీతోనే మసాలా యాడ్ చేస్తే వావ్.. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది స్పైసీ అంటే ఇష్ట పడే వారికి బాగా నచ్చుతుంది. మరి ఈ చిల్లీ మ్యాగీ మసాలా ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చిల్లీ మ్యాగీ మసాలాకు కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన మ్యాగీ, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, వెల్లుల్లి తరుగు, వైట్ వెనిగర్, సోయా సాస్, ఉప్పు, ఆయిల్, బటర్.

చిల్లీ మ్యాగీ మసాలా తయారీ విధానం:

ముందుగా నీటిలో కొద్దిగా ఆయిల్ వేసి మ్యాగీ వేసి ఓ రెండు నిమిషాలు ఉడికించి.. నీళ్లను తీసేసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్‌లో వైట్ వెనిగర్, సోయాసాస్, వెల్లుల్లి వేసి మెత్తని పేస్టులా చేయాలి. ఇఫ్పుడు ఒక పాన్ తీసుకుని ఇందులో ఆయిల్, కొద్దిగా బటర్ వేయాలి. ఆ తర్వాత ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి తరుగు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులో వెల్లుల్లి మిశ్రమం వేసి బాగా ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మ్యాగీతో పాటు ఇచ్చే మసాలాను కూడా వేసి మొత్తం మరోసారి కలపాలి. ఇవన్నీ బాగా వేగాక.. ఉడికించి పక్కన పెట్టిన మ్యాగీ వేసి మొత్తం కలిసేలా బాగా టాస్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చిల్లీ మ్యాగీ మసాలా. ఇందులో కావాలి అనుకుంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు.

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!