Tomato Soup: రెస్టారెంట్ స్టైల్ టమాటా సూప్.. చలికాలంలో మంచి కాంబినేషన్!
ఎప్పుడూ హోటల్స్, రెస్టారెంట్లలోనే కాకుండా ఇంట్లో కూడా సూప్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా సింపుల్‌గా ఇంట్లో తయారు చేసుకునే వాటిల్లో టమాటా సూప్ కూడా ఒకటి. . మరి ఇది ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకోండి..
చలి కాలంలో హాట్ హాట్‌గా సూప్స్‌కి తాగితే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సూప్స్‌లో కూడా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. చలి కాలంలో ఖచ్చితంగా సూప్స్ తాగాలి. శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. సూప్స్‌లో చాలా రకాలు ఉంటాయి. ఇంట్లో కూడా మనం ఈజీగా సూప్స్ తయారు చేసుకోవచ్చు. అలా వాటిల్లో ఈ టమాటా సూప్ కూడా ఒకటి. ఈ సూప్ చేసేందుకు పెద్దగా సమయం పట్టదు. చాలా తక్కువ సమయంలో సులభంగా చేసుకోవచ్చు. మరి రెస్టారెంట్ స్టైల్ టమాటా సూప్ ఎలా తయారు చేస్తారు? ఈ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
టమాటా సూప్‌కి కావాల్సిన పదార్థాలు:
టమాటాలు, మిరియాల పొడి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, తోటకూర లేదా పాలకూర, కొద్దిగా బేకింగ్ సోడా, కొత్తిమీర, కారం, ఉప్పు, ఆయిల్, నెయ్యి, బటర్, బ్రెడ్ ముక్కలు.
టమాటా సూప్ తయారీ విధానం:
ముందుగా టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి.. మిక్సీ జార్‌లో వేసి కచ్చా పచ్చా మిక్సీ పట్టి ఓ గిన్నెలోకి తీసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి, తోట కూర లేదా పాలకూర తరుగును కూడా కోసం మిక్సీ జార్‌లో వేయండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు సాస్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్, బటర్ వేసుకోండి. బేకింగ్ సోడా వేసి ఓ నిమిషం వేయించి.. బెంట్ చేసిన టమాటమా పేస్ట్, వెల్లుల్లి మిశ్రమం వేయండి. వీటిని ఓ ఐదు నిమిషాలు వేయించాక.. కారం, ఉప్పు కూడా వేసి ఉడికించుకోండి.
ఇప్పుడు పల్చగా అయ్యేలా నీరు వేసి ఓ పది నిమిషాలు మీడియం మంట మీద ఉడికించండి. సూప్ కాస్త చిక్కగా నీరు ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తిమీర చల్లండి. అంతా ఒకసారి కలిపి.. చివరగా బటర్ వేసి మొత్తం కలపండి. అంతే టమాటా సూప్ సిద్ధం. పైన బటర్‌లో వేయించిన బ్రెడ్ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే.. టమాటా సూప్ సిద్ధం.