Sajjala Laddu: సజ్జలతో లడ్డూ ఇలా తయారు చేస్తే.. రుచి, ఆరోగ్యం మీ సొంతం!
సజ్జలతో చేసే టేస్టీ వంటకాల్లో ఇప్పటికే చాలానే తెలుసుకున్నాం. తాజాగా మీ కోసం మరో రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ లడ్డూ కూడా చాలా రుచిగా ఉంటుంది. రోజుకో లడ్డూ తింటే చాలా మంచిది..

మిల్లేట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిల్లేట్స్‌లో సజ్జలు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇప్పుడంటే వీటిని తినడం మానేస్తున్నారు. కానీ పూర్వం వీటినే ఎక్కువగా తిని ఎన్నో ఏళ్లు ఆరోగ్యంగా జీవించారు. సజ్జలతో చేసే టేస్టీ వంటకాల్లో ఇప్పటికే చాలానే తెలుసుకున్నాం. తాజాగా మీ కోసం మరో రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ లడ్డూ కూడా చాలా రుచిగా ఉంటుంది. రోజుకో లడ్డూ తింటే చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకు ఇవ్వడం వల్ల ఉక్కులా ఉంటారు. మరి ఈ సజ్జల లడ్డూ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సజ్జల లడ్డూకి కావాల్సిన పదార్థాలు:
సజ్జలు, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలకుల పొడి.
సజ్జల లడ్డూ తయారీ విధానం:
ఈ లడ్డూలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటికి పెద్దగా సమయం కూడా పట్టదు. ముందుగా సజ్జలను వేయించి తీసి పక్కన పెట్టండి. ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి పొడిలా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత బెల్లాన్ని తురుముకుని ఇందులో వేయండి. బెల్లం అంతా కరిగాక.. స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు ఈ బెల్లం మిశ్రమంలో.. కొద్దిగా యాలకుల పొడి, సజ్జల పిండి, డ్రై ఫ్రూట్స్ వేసి అన్నీ మిక్స్ చేయాలి. యాలకుల పొడి అనేది ఆప్షనల్. కానీ వేస్తే రుచి బాగుంటుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత చేతులకు నెయ్యి రాసుకుని.. చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేయండి. కనీసం పది రోజులైనా నిల్వ ఉంటాయి. రోజుకు ఒకటి తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ఇందులో నువ్వులు కూడా వేసి కలుపుకోవచ్చు.








