Putnalu Bellam Sweet: బెల్లం, పుట్నాలతో హెల్దీ స్వీట్.. టేస్ట్ చేశారంటే వదిలి పెట్టరు!

పుట్నాల పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్‌, ఫైబర్, విటమిన్స్ వంటి పోషకాలు ఉంటాయి. పుట్నాల పప్పు చాలా రకాలుగా ఆహారంలోకి ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్నాల పప్పును చిరుతిండిగా కూడా ఉపయోగించవచ్చు. అయితే పుట్నాల పప్పుతో స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ కూడా రుచిగా ఉంటుంది. అదే విధంగా హెల్త్‌కి కూడా మంచిది. వంట చేయని వారు కూడా ఈ స్వీట్..

Putnalu Bellam Sweet: బెల్లం, పుట్నాలతో హెల్దీ స్వీట్.. టేస్ట్ చేశారంటే వదిలి పెట్టరు!
Putnalu Bellam Sweet
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 30, 2024 | 8:52 PM

పుట్నాల పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్‌, ఫైబర్, విటమిన్స్ వంటి పోషకాలు ఉంటాయి. పుట్నాల పప్పు చాలా రకాలుగా ఆహారంలోకి ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్నాల పప్పును చిరుతిండిగా కూడా ఉపయోగించవచ్చు. అయితే పుట్నాల పప్పుతో స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ కూడా రుచిగా ఉంటుంది. అదే విధంగా హెల్త్‌కి కూడా మంచిది. వంట చేయని వారు కూడా ఈ స్వీట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ తయారు చేయడం కోసం ఎక్కువ సమయం కూడా ఏమీ పట్టదు. మరి పుట్నాల, బెల్లం స్వీట్ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పుట్నాల స్వీట్‌కి కావాల్సిన పదార్థాలు:

పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, యాలకులు, బెల్లం తురుము, నెయ్యి, యాలకులు.

ఇవి కూడా చదవండి

పుట్నాల స్వీట్ తయారీ విధానం:

ముందుగా కడాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఇందులో పుట్నాల పప్పు, కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. చిన్న మంటపైనే వీటిని వేయించాలి. ఆ తర్వాత వీటిని చల్లారనిచ్చి.. మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే యాలకులు కూడా వేసి.. మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో బెల్లం తురుము, నీళ్లు వేసి వేడి చేయాలి. బెల్లం కరిగాక.. మిక్సీ పట్టిన పుట్నాల పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీన్ని దగ్గర పడేంత వరకూ ఉడికించాలి. ఆ తర్వాత నెయ్యి రాసిన ఒక ప్లేట్‌లోకి తీసుకుని.. అందులో వేయాలి. ఇది పూర్తిగా చల్లారాక.. ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉంటే పుట్నాల బెల్లం స్వీట్ తయారు. ఈ స్వీట్ అందరికీ నచ్చుతుంది. ఒక మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది.

బెల్లం, పుట్నాలతో హెల్దీ స్వీట్.. టేస్ట్ చేశారంటే వదిలి పెట్టరు!
బెల్లం, పుట్నాలతో హెల్దీ స్వీట్.. టేస్ట్ చేశారంటే వదిలి పెట్టరు!
బంగారం ధర ఎందుకు తగ్గింది.? ఎప్పటివరకు ఇలా ఉంటుంది.?
బంగారం ధర ఎందుకు తగ్గింది.? ఎప్పటివరకు ఇలా ఉంటుంది.?
కొర్రలతో కట్ లెట్.. టేస్ట్ అదిరి పోతుంది..
కొర్రలతో కట్ లెట్.. టేస్ట్ అదిరి పోతుంది..
గంజాయి గురించి సమాచారమిస్తే రివార్డ్: హోంమంత్రి అనిత కీలక ప్రకటన
గంజాయి గురించి సమాచారమిస్తే రివార్డ్: హోంమంత్రి అనిత కీలక ప్రకటన
ఇలా చేశారంటే చేతి గోళ్ల నెయిల్‌ పాలీష్‌ సులువుగా ఊడిపోతుంది
ఇలా చేశారంటే చేతి గోళ్ల నెయిల్‌ పాలీష్‌ సులువుగా ఊడిపోతుంది
రండి బాబూ రండి.! ఓన్లీ ఫర్ సింగిల్స్.. హాగ్‌కు రూ. 11, ముద్దుకు..
రండి బాబూ రండి.! ఓన్లీ ఫర్ సింగిల్స్.. హాగ్‌కు రూ. 11, ముద్దుకు..
ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో కోట్ల విలువైన బంగారం చోరీ.!
ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో కోట్ల విలువైన బంగారం చోరీ.!
ఫ్యాటీ లివర్‌ ఎంత డేంజరో తెలుసా? ఈ ఆహారాలు పూర్తిగా మానేయాల్సిందే
ఫ్యాటీ లివర్‌ ఎంత డేంజరో తెలుసా? ఈ ఆహారాలు పూర్తిగా మానేయాల్సిందే
సింపుల్‌గా చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టే జ్యూస్‌లు.. పిప్పి చే
సింపుల్‌గా చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టే జ్యూస్‌లు.. పిప్పి చే
రెమ్యునరేషన్ లో పోటీ పడుతున్న స్టార్ హీరోయిన్స్.!
రెమ్యునరేషన్ లో పోటీ పడుతున్న స్టార్ హీరోయిన్స్.!