Oats Masala Vada: ఓట్స్‌తో ఇలా మసాలా వడ చేయండి.. టేస్ట్ అదిరిపోతుందంతే!
ఓట్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. శరీరానికి మేలు చేసే వాటిల్లో ఓట్స్ కూడా ఒకటి. ఓట్స్‌తో టిఫిన్స్, స్నాక్స్ వంటివి ఎన్నో తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా లైట్‌గా ఉంటాయి. ఓట్స్‌తో చాలా మంది దోశ, ఇడ్లీ, ఉప్మా వంటివి చేసుకుని ఉంటారు. కానీ ఓట్స్‌తో మసాలా వడలు కూడా తయారు చేసుకోవచ్చు. హెల్దీగా స్నాక్స్ తినాలి అనుకునేవారు..

ఓట్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. శరీరానికి మేలు చేసే వాటిల్లో ఓట్స్ కూడా ఒకటి. ఓట్స్‌తో టిఫిన్స్, స్నాక్స్ వంటివి ఎన్నో తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా లైట్‌గా ఉంటాయి. ఓట్స్‌తో చాలా మంది దోశ, ఇడ్లీ, ఉప్మా వంటివి చేసుకుని ఉంటారు. కానీ ఓట్స్‌తో మసాలా వడలు కూడా తయారు చేసుకోవచ్చు. హెల్దీగా స్నాక్స్ తినాలి అనుకునేవారు ఈ మసాలా వడలు తయారు చేయండి. వీటితో కూడా చాలా రుచిగా ఉంటాయి. మరి ఓట్స్‌తో మసాలా వడలు ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఓట్స్ మసాలా వడకు కావాల్సిన పదార్థాలు:
ఓట్స్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం ముక్కలు, కొత్తి మీర, కరివేపాకు, పచ్చి శనగ పప్పు, కారం, దంచిన ధనియాలు, ఆయిల్, ఉప్పు.
ఓట్స్ మసాలా వడ తయారీ విధానం:
ముందుగా పచ్చి శనగ పప్పు, ఓట్స్ వేరు వేరుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి శనగ పప్పును నీళ్లు వేయకుండా.. బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే నానబెట్టిన ఓట్స్, కారం, ఉప్పు, కొద్దిగా ఆయిల్, కొత్తి మీర, ఉల్లి, అల్లం, పచ్చి మిర్చి తరుగు, దంచిన ధనియాలు, కరివేపాకు వేసి బాగా చేతితో పిసకాలి. నీళ్లు అవసరం అయితే కొద్దిగా వేసి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక మంటను సిమ్‌లో పెట్టి.. వడల మాదిరిగా వేసుకోవాలి.
వీటిని రెండు వైపులా ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇవి బాగా వేగాక.. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని నేరుగా తినవచ్చు. లేదా పుదీనా చట్నీ, టమాటా కిచప్ తో తిన్నా బాగానే ఉంటాయి. ఈ వడలను అందరూ తినవచ్చు. పిల్లలకు బాగా నచ్చుతాయి. ఇన్ స్టెంట్‌గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. మరింకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.








