- Telugu News Photo Gallery Kidney Detox Food: These Foods That Can Cleanse And Detoxify The Kidneys Naturally
World Kidney Day: కిడ్నీలను సహజంగా శుభ్రంచేసే అద్భుత పండ్లు.. రోజూ కాసిన్ని తిన్నా చాలు!
Kidney Detox Food.. శరీరంలో పేరుకుపోయిన మలినాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించాలి. లేదంటే శరీరంలో ఈ వ్యర్థపదార్థాలు రోజురోజుకూ పేరుకుపోయి అనారోగ్యానికి గురవుతాం. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట వస్తుంది. కాబట్టి నిర్విషీకరణ అవసరం. కాలేయం, మూత్రపిండాలు శరీర నిర్విషీకరణలో సహాయపడతాయి. కిడ్నీలు మూత్రాన్ని తయారు చేయడం ద్వారా శరీరం నుంచి జీవక్రియ వ్యర్థాలను తొలగిస్తుంది. కాలేయం, మూత్రపిండాలు రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి..
Updated on: Mar 15, 2024 | 7:13 PM

శరీరంలో పేరుకుపోయిన మలినాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించాలి. లేదంటే శరీరంలో ఈ వ్యర్థపదార్థాలు రోజురోజుకూ పేరుకుపోయి అనారోగ్యానికి గురవుతాం. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట వస్తుంది. కాబట్టి నిర్విషీకరణ అవసరం. కాలేయం, మూత్రపిండాలు శరీర నిర్విషీకరణలో సహాయపడతాయి. కిడ్నీలు మూత్రాన్ని తయారు చేయడం ద్వారా శరీరం నుంచి జీవక్రియ వ్యర్థాలను తొలగిస్తుంది. కాలేయం, మూత్రపిండాలు రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి.

కాలేయం, మూత్రపిండాల నిర్విషీకరణ చేయడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. నిర్విషీకరణలో ఆహారం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మరి దీని కోసం ఎలాంటి ఫుడ్ తినాలో ఇక్కడ తెలుసుకుందాం.. మూత్రపిండాల నిర్విషీకరణలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. నీరు సహజంగా శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.

క్రాన్బెర్రీ కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పండు కిడ్నీలోని కాలుష్య కారకాలను తొలగిస్తుంది. క్రాన్ బెర్రీ జ్యూస్ తీసుకోవడం ద్వారా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్లాడర్ ఇన్ఫెక్షన్ నివారించవచ్చు.

చేపలు తినడం వల్ల కూడా కిడ్నీలోని వ్యర్థాలు బయటకు పోతాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం, సముద్రపు చేపలలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇది మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ విధంగా మీరు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

బత్తాయి, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు కిడ్నీలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి. ఈ పండ్లలో అధిక మొత్తంలో సిట్రేట్ ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇలాంటి పండ్లను తినడం వల్ల కూడా మూత్రంలో యాసిడ్ తగ్గుతుంది. ఇది కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజూ ఒక కీర దోసకాయ తినాలి. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని తాజాగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అంతేకాకుండా, దోసకాయలో మూత్రవిసర్జన లక్షణాలు ఉంటాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లను నివారించి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.




