- Telugu News Photo Gallery Cricket photos Punjab Kings Part Ways With Wasim Jaffer as Batting Coach Ahead Of IPL 2024
IPL 2024: ధావన్ టీం నుంచి కీలక సభ్యుడు ఔట్.! 57 సెంచరీలున్న ఈ ప్లేయర్‌ను తన్ని తరిమేశారు..
మరో వారం రోజుల్లో రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈలోగా ప్రతీ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్లు మొదలుపెట్టేసింది. ఇదిలా ఉంటే.. లీగ్ స్టార్ట్ కాకముందే పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం..
Updated on: Mar 14, 2024 | 7:21 PM

మరో వారం రోజుల్లో రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈలోగా ప్రతీ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్లు మొదలుపెట్టేసింది. ఇదిలా ఉంటే.. లీగ్ స్టార్ట్ కాకముందే పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్.. తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు.

వసీం జాఫర్ నిష్క్రమణతో.. ఆ జట్టు డైరక్టర్ సంజయ్ బంగర్.. బ్యాటింగ్ కోచ్ బాధ్యతలను కూడా చేపట్టనున్నాడు. ఇంతకముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు సంజయ్ బంగర్.

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది. మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ, ఈ జట్టు లీగ్ ముగిసే సమయానికి 14 మ్యాచ్‌లలో కేవలం 6 మాత్రమే గెలిచింది. దీంతో ఈ జట్టు ప్లేఆఫ్‌కు కూడా చేరుకోలేకపోయింది.

కాగా, వసీం జాఫర్ రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించిన విషయం తెలిసిందే. అతడి పేరుపై రంజీల్లో 57 సెంచరీలు, లిస్ట్ A క్రికెట్‌లో 10 సెంచరీలు ఉన్నాయి.




