Mutton Bone Soup: మటన్ బోన్ సూప్ ఇలా చేశారంటే.. రుచి, ఆరోగ్యం కూడా..

మటన్ బోన్ సూప్ ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సూప్ తాగిన వాళ్లకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మటన్ బోన్ సూప్ తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..

Mutton Bone Soup: మటన్ బోన్ సూప్ ఇలా చేశారంటే.. రుచి, ఆరోగ్యం కూడా..
Mutton bone Soup
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 10, 2024 | 10:04 PM

మటన్ బోన్ సూప్ లేదా మటన్ పాయా ఇంచుమించు ఈ రెండూ ఒకటే. పిలిచేందుకు రెండూ వేరే అయినా ప్రయోజనాలు ఒకటే. మటన్ బోన్ సూప్‌లో కేవలం ఎముకలను వాడతారు. మటన్ పాయాలో మాత్రం కాళ్లను వేస్తారు. నిజానికి మటన్ బోన్ సూప్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. పూర్వం ఎక్కువగా మటన్ బోన్స్‌తో కూర చేసి తీసుకునేవారు. ఈ మధ్య కాలంలో ఇంట్లో వంటలు చేయడం తగ్గించేసి.. బయట తినేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ బయట హోటల్స్‌లో ఏం కలుపుతున్నారో చెప్పడం కష్టం. ఇంట్లోనే మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాస్త సమయం పట్టినా ఆరోగ్యంగా చేసుకోవచ్చు. మరి ఈ మటన్ బోన్ సూప్ ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మటన్ బోన్ సూప్‌కి కావాల్సిన పదార్థాలు:

మటన్ బోన్స్, ఉల్లిపాయలు, టమాటా, పచ్చి మిర్చి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకులు, మిరియాల పొడి, నెయ్యి, ఆయిల్, జీరా పొడి, ధనియా పొడి.

మటన్ బోన్ సూప్‌ తయారీ విధానం:

మటన్ ఎముకలను శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి, నూనె వేసి వేడి చేసి.. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకులు వేడి వేయించాలి. ఇవి వేగాక ఉల్లి, పచ్చి మిర్చి తరుగు కూడా వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు రంగు మారక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి.. టమాటాలు వేసి మెత్తబడే దాకా ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

ఈ సమయంలో మటన్ బోన్ ముక్కలు కూడా వేయి ఓ ఐదు నిమిషాలు ఉడికించి.. పసుపు, కారం, ఉప్పు, ధనియా పొడి, జీరా పొడి, గరం మాసాలా, మిరియాల పొడి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి మరో రెండు నిమిషాలు కలపాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి.. కనీసం 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆవిరి పోయాక మూత తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ బోన్ సూప్ సిద్ధం.

తెల్లారేసరికి కాలేజీ ఆవరణలో భయంకర సీన్.. అమ్మాయిలు చూడగా..
తెల్లారేసరికి కాలేజీ ఆవరణలో భయంకర సీన్.. అమ్మాయిలు చూడగా..
ఇంటి వరండాలో వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా
ఇంటి వరండాలో వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా
ఆ దేశంలో శృంగార మంత్రిత్వశాఖ ఏర్పాటు.. ఎందుకో తెలుసా?
ఆ దేశంలో శృంగార మంత్రిత్వశాఖ ఏర్పాటు.. ఎందుకో తెలుసా?
యుద్ధం చెయ్యమని పంపిస్తే.. నీలి చిత్రాలు చూస్తున్నారు.! వీడియో
యుద్ధం చెయ్యమని పంపిస్తే.. నీలి చిత్రాలు చూస్తున్నారు.! వీడియో
ముంచుకొస్తున్న మరో గండం.! రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం.
ముంచుకొస్తున్న మరో గండం.! రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం.
బియ్యం కడిగిన నీళ్లే కదా అని చీప్‌గా చూడకండి.! వీటితో ఎన్నో ఉపయోగ
బియ్యం కడిగిన నీళ్లే కదా అని చీప్‌గా చూడకండి.! వీటితో ఎన్నో ఉపయోగ
వామ్మో.. కట్టలు కట్టలుగా పాములు ఒకేసారి.! విశాఖ సిటీ షేక్..
వామ్మో.. కట్టలు కట్టలుగా పాములు ఒకేసారి.! విశాఖ సిటీ షేక్..
ఊహించని విధంగా హరితేజ ఎలిమినేట్. కానీ రెమ్యునరేషన్‌ అన్ని లక్షలా?
ఊహించని విధంగా హరితేజ ఎలిమినేట్. కానీ రెమ్యునరేషన్‌ అన్ని లక్షలా?
చావు కళ్ల ముందే స్పష్టంగా కనిపించింది..!
చావు కళ్ల ముందే స్పష్టంగా కనిపించింది..!
నేను పెళ్లి చేసుకోవాలా.? వద్దా.? ఆయన వల్లే పెళ్లి చేసుకోలేదా.?
నేను పెళ్లి చేసుకోవాలా.? వద్దా.? ఆయన వల్లే పెళ్లి చేసుకోలేదా.?