Foxtail Millet Benefits : కొర్రలతో కొండంత ఆరోగ్యం..! ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. చాలా మంది శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్రైఫ్రూట్స్‌, మిల్లెట్స్‌, నట్స్‌ వంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. చిరు ధాన్యాలు తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే మిల్లెట్స్‌లో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కొర్రలు చాలా ముఖ్యమైనవి. ఇందులోని ఔషధ గుణాలు శరీరానికి చాలా మంచివి. కొర్రలు తీసుకోవటం వల్ల కలిగే లాభాలేంటో ఒక్కసారి తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Nov 10, 2024 | 3:37 PM

చిరుధాన్యాలుగా పిలువబడే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొర్రల్లో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ధైమిన్, రైబోఫ్లేవిన్ తో పాటు అధిక మొత్తంలో పీచు పదార్థం కలిగి ఉంటుంది. వరి బియ్యం వండుకున్నట్లుగానే కొర్ర బియ్యాన్ని వండుకోవచ్చు. కొర్రలు తీపి, వగరు రుచిని కలిగి ఉంటాయి.

1 / 5
కొర్రల్లో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చిన్నపిల్లలకు, గర్భిణిలకు మంచి ఆహారం. ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. కడపునొప్పి, మూత్రంలో మంట, ఆకలి లేకపోవడం, అతిసారం వంటి సమస్యలకు కొర్రలతో చెక్ పెట్టొచ్చు. వీటిని నిత్యం తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.

2 / 5
అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధిని మందగించడానికి విటమిన్ బీ 1.. కొర్రల్లో అధికంగా ఉంటుంది. అలాగే, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి. నాడీవ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపే మోరెల్ విటమిన్ కొర్రల్లో లభిస్తుంది. మానసిక దృక్పథానికి మద్దతు ఇస్తుంది. బెల్స్ పాల్సీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఎంతగానో సహాయపడుతుంది.

3 / 5
నాడీ వ్యవస్థ పనితీరు సజావుగా సాగడానికి వీటిలోని ప్రోటీన్ సహాయపడుతుంది. కొర్రలను రెగ్యులర్‌గా తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా వీటిని నిత్యం తినేవారిలో కీళ్ల నొప్పులు, మతిమరుపు కనిపించవు.

4 / 5
కొర్రల్లో మాంసకృత్తులు, ఐరన్ శాతం ఎక్కువుగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి జీర్ణశక్తిని పెంచుతాయి. రక్తాన్ని వృద్దిచేస్తుంది. శరీరానికి అమితమైన పుష్టినిస్తాయి. ముఖ్యంగా నడుముకు మంచి శక్తిని ఇస్తాయి.

5 / 5
Follow us