Methi Puri: ఈ పూరీలు ఎంతో రుచితో పాటు ఆరోగ్యం కూడా.. ఎవరైనా తినొచ్చు!
మెంతికూరతో చేసే ఈ పూరీలు చాలా రుచిగా ఉంటాయి. కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదే. ఈ పూరీలను ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధ పడేవారైనా తినవచ్చు. మరి ఈ పూరీలను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం..
పూరీలు అంటే ఇష్టం లేని వారు ఉండరు. వేడి వేడిగా పూరీలు వేస్తూ ఉంటే.. ఒక దాని తర్వాత మరొకటి లాగించేస్తూ ఉంటారు. పెద్దలకు, పిల్లలకు కూడా చాలా ఇష్టం. అయితే ఆయిల్ ఫుడ్ అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి పూరీలను కూడా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఈ పూరీ పిండిలో మెంతి కూరను కలిపి చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారైనా తినొచ్చు. ఇందులో పోషకాలు ఉంటాయి. మరి ఈ మెంతికూర పూరీలు ఎలా తయారు చేస్తారు? ఈ మెంతి కూర పూరీలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మెంతికూర పూరీలకు కావాల్సిన పదార్థాలు:
మెంతి కూర, గోధుమ పిండి, ఉప్పు, ఆయిల్.
మెంతికూర పూరీలు తయారీ విధానం:
ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడుక్కాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడా శుభ్రంగా కడిగి పెట్టిన మెంతికూర వేయండి. పసుపు, ఉప్పు, కారం వేసి బాగా వేయించండి. మెంతికూర బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని అందులో మీకు కావాల్సినంత క్వాంటిటీలో గోధుమ పిండిని వేసుకోండి. ఆ తర్వాత చల్లారిన మెంతి కూర ఫ్రై వేయండి.
ఫ్రైలో ఉప్పు వేశాం కాబట్టి కాస్త చూసుకుని ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి.. పూరీ పిండిలా వత్తుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి. ఇప్పుడు ఒక్కో పూరీ చేసుకుంటూ కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మెంతి కూర పూరీలు సిద్ధం. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. నేరుగా తిన్నా బాగుంటాయి. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.