Amla Curry: ఉసిరి కాయలతో టేస్టీ కర్రీ.. రుచి, ఆరోగ్యం కూడా..
ఉసిరి కాయలతో ఎక్కువగా చాలా మంది పచ్చళ్లు పెడుతూ ఉంటారు. కానీ ఉసిరితో కూరలు కూడా తయారు చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా అంటారు. కాస్తు పుల్లగా ఉన్నా.. రుచి మాత్రం అదుర్స్ అంతే. మరి ఉసిరి కాయలతో కర్రీ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఉసిరి కాయలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతీ రోజూ చిన్న ఉసిరి ముక్క తిన్నా.. ఎన్నో రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మానికి, జుట్టు బలంగా ఉండేందుకు సహాయ పడుతుంది. ఉసిరి కాయలతో ఎక్కువగా చాలా మంది పచ్చళ్లు పెడుతూ ఉంటారు. కానీ ఉసిరితో కూరలు కూడా తయారు చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా అంటారు. కాస్తు పుల్లగా ఉన్నా.. రుచి మాత్రం అదుర్స్ అంతే. మరి ఉసిరి కాయలతో కర్రీ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉసిరి కాయల కర్రీ కావాల్సిన పదార్థాలు:
ఉసిరి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, పచ్చి మిర్చి, పసుపు, కరివేపాకు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, ఆయిల్.
ఉసిరి కాయల కర్రీ తయారీ విధానం:
ముందుగా పచ్చి ఉసిరి కాయలను ఉడకబెట్టుకోవాలి. ముక్కలుగా కోసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నీటిని వంచేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, సోంపు వేసి దోరగా వేయించి చల్లార్చుకోవాలి. వీటిని మీక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి ఎర్రగా వేయించుకోవాలి.
ఆ తర్వాత కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, మిక్సీ పట్టిన పొడి వేసి అన్నీ ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక పక్కన పెట్టిన ఉసిరి కాయలు కూడా వేసి అన్నీ చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి దించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఉసిరి కాయ కర్రీ సిద్ధం. వీటిల్లో వంకాయలు, బెండకాయలు, ములక్కాయ కూడా వేసి వండుకున్నా చాలా రుచిగా ఉంటుంది.