Sour Curd Sweet: పెరుగు పుల్లగా.. తీయగా.. రుచిగా ఉండాలంటే ఇలా చేస్తే సరి..
పెరుగంటే ఇష్టపడని వారుండరు. షడ్రుచులతో భోజనం చేసినా పెరుగుతో ముగింపు చెప్పకుంటే అస్సుల బాగుండదు. చివర్లో పెరుగుతో ఒక ముద్ద అయినా తిననిది...
చల్ల(winter season) నుంచి వాతావరణం మారుతోంది. ఎండలు దంచికొట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఈ సమయంలో చల్ల చల్లని మజ్జిగ(buttermilk) తాగితే ఆరోగ్యానకిి మేలు చేస్తుంది. దీనికి తోడు చలికాలం తీయటి పెరుగు కూడా ఎండలు పెరుగుతున్నకొద్ది పుల్లగా మారిపోతాయి. అయితే పుల్లని పెరుగును చాలామంది ఇష్టంగా తినరు.అయితే అలా అని పెరుగంటే ఇష్టపడని వారుండరు. షడ్రుచులతో భోజనం చేసినా పెరుగుతో ముగింపు చెప్పకుంటే అస్సుల బాగుండదు. చివర్లో పెరుగుతో ఒక ముద్ద అయినా తిననిది ఆ భోజనం సంతృప్తిగా అనిపించదు. అలా అని ఆ పెరుగు పుల్లగా ఉంటే తినలేం. తియ్యగా ఉంటేనే ఓ రెండు ముద్దలు ఎక్కువ లాగించేస్తాం. మరి ఎండాకాలంలో పెరుగు పులిసిపోకుండా రుచిగా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి.
పెరుగు కమ్మగా..
- పాలను బాగా మరిగించాలి. తోడు వేయడానికి ఉపయోగించే పెరుగు పుల్లగా లేకుండా చూసుకోవాలి. వేడి పాలల్లో కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే పెరుగు కలిపి మూత పెట్టాలి. దీన్ని మరీ స్టౌకి దగ్గరగా పెట్టొద్దు. పెరుగును మట్టిపాత్రలో లేదా సిరామిక్ గిన్నెలో తోడు పెడితే…గట్టిగా తోడుకుంటుంది. కమ్మగానూ ఉంటుంది.
- సాధారణంగా మర్నాడు తినడానికి రాత్రి, మధ్యాహ్నానికి ఉదయాన్నే తోడు పెడతారు. అలాకాకుండా భోజనం తినేవేళకు ఐదారు గంటల ముందు ఇలా చేస్తే సరి. ఆపై వెంటనే ఫ్రిజ్‌లో పెడితే రుచి మారదు. పెరుగు గిన్నెపై మూత తప్పనిసరి. మూత లేకపోతే మిగతా పదార్థాల వాసనలు పెరుగులో కలిసిపోయి కూడా త్వరగా పులిసిపోయే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి: Russia Ukraine War: అణు విద్యుత్తు కేంద్రంపై బాంబుల వర్షం.. వీడియోను విడుదల చేసిన ఉక్రెయిన్..