Weight Loss: త్వరగా బరువు తగ్గాలా? జిమ్‌కు వెళ్లక్కరలేదు.! ఈ పండ్లు మీ డైట్‌లో చేర్చండి చాలు..
పండ్లలో ఎప్పుడూ ప్రోటీన్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాజా పండ్లు ఎలప్పుడూ రుచికరంగా ఉంటాయి. అందుకే వైద్యులు ప్రతీ రోజూ..
పండ్లలో ఎప్పుడూ ప్రోటీన్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాజా పండ్లు ఎలప్పుడూ రుచికరంగా ఉంటాయి. అందుకే వైద్యులు ప్రతీ రోజూ ఓ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచిస్తుంటారు. ఇదిలా ఉంటే.. కొన్ని పండ్లలో పీచు, పెక్టిన్ అధికంగా ఉంటాయి. ఈ రెండూ కూడా కొవ్వును కరిగించేందుకు పని చేస్తాయి. అంతేకాదు జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఈ పండ్లలో విటమిన్లు. ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. అలాగే క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇక బరువు తగ్గాలని చూసేవారికి ఇవి సరైన ఆప్షన్. ఎక్కువ మంది డాక్టర్లు కూడా బరువు తగ్గేందుకు తక్కువ క్యాలరీల ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. మరి ఆ పండ్లు ఏంటో చూసేద్దాం పదండి..
పుచ్చకాయ:
పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది మిమ్మల్ని డిహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. ఇందులో అర్జినైన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. అది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
జామ:
జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి విముక్తి పొందొచ్చు. కాబట్టి ఇది బరువు తగ్గాలనుకునే వారికి సరైన ఆప్షన్.
పియర్(Pear):
పియర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇదొక గొప్ప పండు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అది జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. నెమ్మదిగా జీర్ణమయ్యే ఈ పండు.. మీ కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.
నారింజ:
నారింజలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో క్యాలరీలు తక్కువ. స్థూలకాయాన్ని తగ్గించుకోవాలంటే.. తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ క్రమంలోనే నారింజ పండు బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అధిక మొత్తంలో ఫైబర్ ఉండే ఈ పండును తింటే.. మీకు కడుపు నిండినట్టు ఉంటుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు.
బ్లూ బెర్రీస్:
బ్లూ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడతాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల బరువు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు.
ఆపిల్:
యాపిల్స్‌లో క్యాలరీలు తక్కువగా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి చాలా మేలు చేస్తుంది. యాపిల్ పండును మీరు జ్యూస్‌గా తాగినా ఫర్వాలేదు. మీ శరీరానికి చాలా మంచిది.
రేగు పండు:
రేగు పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో పోటాషియం, మ్యాంగనీస్, విటమిన్లు ఎ, సి, కె వంటి పోషకాలు ఉన్నాయి. రేగు పండ్లలో సూపర్ ఆక్సైడ్ ఉంటుంది. దీనిని ఆక్సిజన్ రాడికల్ అని కూడా పిలుస్తారు. ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.