Pineapple Halwa: పైనాపిల్ తో ఒక్కసారి ఇలా హల్వా చేయండి.. అస్సలు వదిలి పెట్టరు!
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనరు. హల్వా గురించి అందరికీ తెలిసిందే. మరికొంత మంది దీన్ని కేసరి అని పిలుస్తారు. ఎలా పిలిచినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పటికీ హల్వాని ఇష్టపడి తినే వారు చాలా మంది ఉన్నారు. సాధారణంగా హల్వాని రవ్వతో చేస్తూంటారు. కానీ ఒక్కసారి ఇలా పైనాపిల్ తో తయారు చేయండి అస్సలు వదిలి పెట్టరు. అంత టేస్టీగా ఉంటుంది. అలా నోట్లో వేసుకోగానే.. ఇలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి..

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనరు. హల్వా గురించి అందరికీ తెలిసిందే. మరికొంత మంది దీన్ని కేసరి అని పిలుస్తారు. ఎలా పిలిచినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పటికీ హల్వాని ఇష్టపడి తినే వారు చాలా మంది ఉన్నారు. సాధారణంగా హల్వాని రవ్వతో చేస్తూంటారు. కానీ ఒక్కసారి ఇలా పైనాపిల్ తో తయారు చేయండి అస్సలు వదిలి పెట్టరు. అంత టేస్టీగా ఉంటుంది. అలా నోట్లో వేసుకోగానే.. ఇలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. మరి పైనాపిల్ హల్వాను ఎలా చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
పైనాపిల్ హల్వాకు కావాల్సిన పదార్థాలు:
పైనాపిల్ ముక్కలు, పైనాపిల్ ఎసెన్స్, రవ్వ, జీడిపప్పు, బాదం పప్పు, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, నెయ్యి, ఎండు ద్రాక్ష, పంచదార.
తయారీ విధానం:
స్టవ్ మీద కడాయి పెట్టుకుని నీళ్లు పోసుకోవాలి (మీరు ఎంత క్వాంటిటీకి చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా నీళ్లు వేసుకోవాలి). ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో పైనాపిల్ ముక్కలు, పైనాపిల్ ఎసెన్స్, పంచదార వేసి ఉడికించుకోవాలి. ఇదంతా మీడియం మంట మీద పెట్టుకోవాలి. మిశ్రమాన్ని మరీ ముద్దగా కాకుండా కాస్త నీళ్లు ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు మరో చిన్న పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని జీడి పప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పులను వేయించుకుని.. ఒక ప్లేట్ లోకి పక్కకు తీసుకోవాలి. నెక్ట్స్ అదే పాన్ లో రవ్వను వేసుకుని గోధుమ రంగు వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో యాలకుల పొడి కూడా వేసుకుని ఒక సారి కలుపుకోవాలి.
ఇప్పుడు ముందుగా పక్కకు పెట్టుకున్న పైనాపిల్ మిశ్రమాన్ని.. ఈ రవ్వలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఉండే ఆవిరంతా పోయి.. ముద్దగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఆ నెక్ట్స్ స్టవ్ ఆఫ్ చేసుకుని, జీడి పప్పు, బాదం, ఎండు ద్రాక్ష వేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పైనాపిల్ హల్వా రెడీ. ఈ హల్వా టేస్ట్ మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. పిల్లలకు ఎంతో నచ్చుతుంది. ఇంకెందుకు లేట్ మీరుకూడా ఒకసారి ట్రై చేయండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.




