Paneer Pulao: టేస్టీగా పన్నీర్ పులావ్‌ని ఇలా చేశారంటే.. వదిలి పెట్టకుండా తింటారు..

బిర్యానీ, పులావ్‌లో చాలా రకాలు ఉంటాయి. వెజ్, చికెన్, మటన్, ఫిష్ ఇలా చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ కూడా వచ్చి చేరింది. చాలా మందికి పన్నీర్ అంటే ఇష్టంగా తింటారు. పన్నీర్‌తో ఎన్నో రకాల స్నాక్స్, కర్రీలు తయారు చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినని వాళ్లు ఎక్కువగా పన్నీర్ తీసుకుంటారు. పన్నీర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఎక్కువా క్యాల్షియం లభిస్తుంది. పిల్లలు కూడా ఎలాంటి డౌట్..

Paneer Pulao: టేస్టీగా పన్నీర్ పులావ్‌ని ఇలా చేశారంటే.. వదిలి పెట్టకుండా తింటారు..
Paneer Pulao
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 29, 2024 | 10:00 PM

బిర్యానీ, పులావ్‌లో చాలా రకాలు ఉంటాయి. వెజ్, చికెన్, మటన్, ఫిష్ ఇలా చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ కూడా వచ్చి చేరింది. చాలా మందికి పన్నీర్ అంటే ఇష్టంగా తింటారు. పన్నీర్‌తో ఎన్నో రకాల స్నాక్స్, కర్రీలు తయారు చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినని వాళ్లు ఎక్కువగా పన్నీర్ తీసుకుంటారు. పన్నీర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఎక్కువగా క్యాల్షియం, ప్రోటీన్ లభిస్తుంది. పిల్లలు కూడా ఎలాంటి డౌట్ లేకుండా పన్నీర్ పెట్టవచ్చు. పన్నీర్ పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా, బలంగా తయారవుతారు. కేవలం వెజ్ బిర్యానీ కాకుండా పన్నీర్‌తో కూడా మనం టీస్టీగా ఉండే పులావ్ తయారు చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలోనే అయిపోతుంది. మరి ఇంత రుచికరమైన పన్నీర్ పులావ్‌కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

పన్నీర్ పులావ్‌కి కావాల్సిన పదార్థాలు:

బాస్మతీ రైస్ లేదా నార్మల్ బియ్యం, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, పన్నీర్, క్యారెట్, పచ్చి బఠాణీలు, తోటకూర, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పులావ్ దినుసులు, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, నెయ్యి లేదా నూనె.

పన్నీర్ పులావ్‌ తయారీ విధానం:

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఓ అరగంట సేపు నాన పెట్టుకోవాలి. ఇప్పుడు పులావ్ తయారు చేసేందుకు గిన్నె పెట్టి.. అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో పన్నీర్ ముక్కలను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పులావ్ దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగాక పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి ఓ నిమిషం పాటు వేయించాలి. ఆ నెక్ట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు తోట కూర, బఠాణీలు, క్యారెట్ వేసి ఓ రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి ఓ నిమిషం వేయించాక.. బియ్యాన్ని వేసి ఓ సారి కలుపు కోవాలి. ఆ తర్వాత మీరు తీసుకున్న బియ్యం కొలతకు నీళ్లు వేసి అంతా ఒకసారి కలుపు కోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి మళ్లీ కలిపి మూత పెట్టాలి. మరో ఐదు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తారు అనగా.. పన్నీర్ ముక్కలు వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టాలి. నెక్ట్స్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ పులావ్ సిద్ధం.

మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో