Chocolate Recipe: హాట్ చాక్లెట్‌ రెసిపీ.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ గుర్తుండిపోతాయి.. ఇంట్లోనే ఇలా చేయండి..

Chocolate Recipe: హాట్ చాక్లెట్‌ స్పెషల్‌ క్రీము, పానీయాలతో తయారు చేస్తారు. దీని రుచి మీ బాల్యాన్ని, సరదాగా నిండిన రోజులను గుర్తుకుతెస్తుంది.

Chocolate Recipe: హాట్ చాక్లెట్‌ రెసిపీ.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ గుర్తుండిపోతాయి.. ఇంట్లోనే ఇలా చేయండి..
Chocolate
Follow us
uppula Raju

|

Updated on: Dec 28, 2021 | 5:18 PM

Chocolate Recipe: హాట్ చాక్లెట్‌ స్పెషల్‌ క్రీము, పానీయాలతో తయారు చేస్తారు. దీని రుచి మీ బాల్యాన్ని, సరదాగా నిండిన రోజులను గుర్తుకుతెస్తుంది. మీరు కోకో పౌడర్, పాలు, సెమీ స్వీట్ చాక్లెట్‌తో తయారు చేసిన ఈ వేడి పానీయాన్ని నూతన సంవత్సర పండుగ సందర్భంగా ఆస్వాదించవచ్చు. బటర్ టోస్ట్ ముక్కతో వేడిగా వడ్డిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మీ పిల్లలు ఈ పానీయాన్ని తెగ ఇష్టపడతారు. మీరు దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

1. మొదట 50 గ్రాముల సెమీ-స్వీట్ చాక్లెట్ లేదా మీకు నచ్చిన ఏదైనా ఇతర చాక్లెట్‌ను తీసుకోండి. 6 నుంచి 7 టేబుల్ స్పూన్లు తరిగిన చాక్లెట్ అవసరం. 2. ఈ తరిగిన చాక్లెట్‌ను చిన్న గిన్నెలో వేసి పక్కన పెట్టండి. 3. పాలను వేడి చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్స్‌ పాలు తీసుకోండి. 4. ఇప్పుడు పాలలో 2 టేబుల్ స్పూన్ల వైట్ గ్రాన్యులేటెడ్ షుగర్ లేదా మాపుల్ సిరప్ కలపండి. మీరు ఉపయోగించే చాక్లెట్ రకాన్ని బట్టి అది తీపిగా ఉంటుందో తెలుసుకొని సరిపడ చక్కెరను కలపండి. 5. మంటను మధ్యస్థంగా తగ్గించి పాలను వేడి చేయడం ప్రారంభించండి. తరచుగా కలపండి. తద్వారా చక్కెర కరిగిపోతుంది. పాలు నెమ్మదిగా మరిగిన వెంటనే మంటను ఆపివేసి, గిన్నెను మంట నుంచి దింపండి. 6. తరిగిన చాక్లెట్ ఉన్న గిన్నెలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వేడి పాలు పోయాలి. చాక్లెట్ కరిగించడానికి బాగా కలపండి. 7. ఇప్పుడు ఈ కరిగించిన చాక్లెట్‌ను వేడి పాలలో కలపండి. ఒక కప్పులో వేడి చాక్లెట్ పోయాలి. 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల విప్డ్ క్రీమ్, చాక్లెట్ షేవింగ్స్, కొద్దిగా కోకో పౌడర్ పైన చల్లండి. అంతే వేడి వేడి చాక్లెట్ రిసిపి తయారవుతుంది.

డార్క్ చాక్లెట్ ప్రయోజనాలు అనేక అధ్యయనాల ప్రకారం.. చాక్లెట్‌ను తగినంత పరిమాణంలో తీసుకుంటే అది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. డార్క్ చాక్లెట్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇది గుండెపోటు రాకుండా నివారిస్తుంది. చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్, కోకో ఉంటాయి. అవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనోల్స్ ఉంటాయి. ఇది దృష్టి, శ్రద్ధ, జ్ఞాపకశక్తి స్థాయిని మెరుగుపరుస్తుంది.

Sweet Potatoes: ఈ వ్యాధులు ఉంటే స్వీట్‌ పొటాటోస్‌ అస్సలు తినకూడదు..! ఎందుకంటే చాలా ప్రమాదం..?

Corn Cutlet: పిల్లలకోసం మొక్కజొన్న కట్లెట్‌.. ఇంట్లోనే సులువుగా చేసేయ్యండి..

Fenugreek Leaves: మెంతి ఆకులతో ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు సుమీ..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.