AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweet Potatoes: ఈ వ్యాధులు ఉంటే స్వీట్‌ పొటాటోస్‌ అస్సలు తినకూడదు..! ఎందుకంటే చాలా ప్రమాదం..?

Sweet Potatoes Side Effects: స్వీట్‌ పొటాటోస్‌ లేదా చిలగడదుంపలు లేదా కందగడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పిండి పదార్ధాలు,

Sweet Potatoes: ఈ వ్యాధులు ఉంటే స్వీట్‌ పొటాటోస్‌ అస్సలు తినకూడదు..! ఎందుకంటే చాలా ప్రమాదం..?
Sweet Potato
uppula Raju
|

Updated on: Dec 28, 2021 | 4:20 PM

Share

Sweet Potatoes Side Effects: స్వీట్‌ పొటాటోస్‌ లేదా చిలగడదుంపలు లేదా కందగడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పిండి పదార్ధాలు, కార్బోహైడ్రేట్లు, కేలరీలు అధికంగా ఉంటాయి. ఈ రూట్ వెజిటేబుల్ పోషకాలతో సమృద్దిగా ఉంటుంది. ఇందులో ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి, ఆర్థరైటిస్‌తో పోరాడుతున్న వారికి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది వారికి హాని చేస్తుంది.

1. మూత్రపిండంలో రాళ్లు ఉన్నవారు కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఆహారంలో చిలగడదుంపను ఎక్కువగా చేర్చుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఆక్సలేట్ నొప్పిని పెంచుతుంది. దీనివల్ల మీకు మరింత హాని కలుగవచ్చు.

2. ఉదర సమస్యలున్నవారు చిలగడ దుంపలు మన్నిటాల్‌ను కలిగి ఉంటాయి. ఇది షుగర్ ఆల్కహాల్ లేదా పాలియోల్ అని పిలువబడే కార్బోహైడ్రేట్ రకం. ఈ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల ఎటువంటి హాని లేనప్పటికీ పొట్ట సమస్యలతో బాధపడేవారికి సమస్యలను కలిగిస్తుంది. పొట్ట సమస్యలతో బాధపడుతున్నప్పుడు చిలగడదుంపను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి, ఉబ్బరం వంటివి వస్తాయి. అందువల్ల పొట్ట సమస్యలు ఉన్నవారు వీటిని తినడం మంచిది కాదు.

3. మధుమేహం ఉన్నవారు బంగాళదుంపలతో పోలిస్తే చిలగడదుంపలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. చిలగడదుంపలు తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కంటెంట్ కలిగి ఉండటం వల్ల చిలగడదుంప శరీరంలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ అది ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

4. గుండె సమస్యలు ఉన్నవారు ఇందులో పొటాషియం దండిగా ఉంటుంది. చిలగడదుంప మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ అతిగా తీసుకుంటే ప్రమాదకరం. పొటాషియం అధికంగా తీసుకోవడం వల్ల హైపర్‌కలేమియా లేదా పొటాషియం టాక్సిసిటీకి దారి తీయవచ్చు ఇది గుండెపోటుకు దారితీస్తుంది.

Juice vs Soup: బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది తీసుకోవాలి.. రసం లేదా సూప్‌లలో ఏది మంచిది?

Sweet Porridge: అల్పాహారంలో ఇది చేర్చండి.. ఇక రోజంతా ఫుల్ యాక్టివ్.. ఒంట్లో కొవ్వు కూడా పరార్..!

Fenugreek Leaves: మెంతి ఆకులతో ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు సుమీ..