AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajjikayalu: హోలీ స్పెషల్ కజ్జికాయలు భారతీయ వంటకం కాదా.. వీటి వెనకాల ఇంత పెద్ద చరిత్ర ఉందా?

హోలీ అంటేనే రంగులతో పాటు నోరూరించే తీపి వంటకాలు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది వంటకాల్లోనూ కజ్జికాయలు బాగా ఫేమస్. ఈ పండగ రోజున కజ్జికాయలను తినడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం కూడా. వీటినే గరిజలు అని కూడా పిలుస్తుంటారు. వీటి లోపల కోవా లేదా కొబ్బరి, చక్కెర వంటి తీపి పదార్థాలతో నింపి తయారు చేస్తారు. వీధి వీధంతా వీటి గుమగుమలు తెలుస్తుంటాయి. మరి ఇంత టేస్టీ కజ్జికాయలు అసలు మన భారతీయుల వంటకమే కాదట. వీటి వెనక ఎంతో పెద్ద స్టోరీ ఉంది. అదేంటో చూద్దాం..

Kajjikayalu: హోలీ స్పెషల్ కజ్జికాయలు భారతీయ వంటకం కాదా.. వీటి వెనకాల ఇంత పెద్ద చరిత్ర ఉందా?
Kajjikayalu History And Recepie
Bhavani
|

Updated on: Mar 14, 2025 | 11:33 AM

Share

హోలీ పండగ రోజున చేసే ఈ కజ్జికాయలు నిజానికి టర్కీకి చెందిన వంటకంగా చెప్తారు. మరి ఈ వంటకం మన దేశానికి ఎలా వచ్చింది. భారతీయుల వంటకంగా ఎలా స్థిరపడింది అనే విషయాల వెనక పెద్ద స్టోరీనే ఉంది. హోలీ రోజు చేసే ఈ తీపి వంటకాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు. ఎలా పిలిచినా, ఏం పదార్థాలు వాడినా దీని రుచిలో మాత్రం ఎప్పుడూ కొత్తదనమే ఉంటుంది. దీని చరిత్ర తెలిస్తే ఎన్నో ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఇది ఎంత పురాతన వంటకమో మీరూ చూడండి.

మౌర్య కాలంలోనూ ఉన్నాయి..

పురాతన సంస్కృత గ్రంథాల ప్రకారం కరణిక అని పిలిచే తీపి పదార్థం ఒకప్పుడు ఉండేది. దీనిని అప్పట్లో ఎండిన పండ్లు, తేనెతో చేసే వారిని చెప్పుకుంటారు. మౌర్య సామ్రాజ్యం కాలంలో కూడా కజ్జికాయ వంటి స్వీట్లు ఉన్నట్టు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఇది భిన్నమైన చంద్రవంక ఆకారంలో ఉండేవని శిల్పాల ద్వారా తెలుస్తున్నాయి.

టర్కీ నుంచి

గుజియా అని పిలిచే ఈ వంటకం మొదట టర్కీలోనే తయారైందని కొందరి వాదన. బక్లావా అనే స్వీట్ వంటకం నుంచే దీనికి ప్రేరణ లభించిందట. అప్పట్లో టర్కీ నుంచి ఉత్తరప్రదేశ్ కు ఎంతో మంది వ్యాపారులు ప్రయాణాలు చేసేవారు. ఆ సమయంలో తమతో పాటు బక్లావా అని పిలిచే స్వీటును కూడా తీసుకొచ్చారని ఇక్కడ ప్రజలకు నేర్పించారని చెప్పుకుంటారు. అలా గుజియా అనేది ఉత్తరప్రదేశ్లో తొలిసారిగా పరిచయమైందని అంటారు. ఇక్కడ ఈ స్థానిక అభిరుచులకు తగ్గట్టు స్థానికులు ఈ గుజియాలను తయారు చేయడం మొదలు పెట్టారని అంటారు.

మొఘల్ యుగంలో కూడా గుజియాలు ఉండేవి. కాలం మారుతున్న కొద్ది కజ్జికాయ కూడా ఎన్నో రకాలుగా తయారవడం మొదలైంది. కోవాతో, కొబ్బరి కోరుతో, డ్రైఫ్రూట్స్ తో ఇలా లోపల నచ్చిన పదార్థాన్ని పెట్టి వండడం మొదలుపెట్టారు. మొఘల్ చక్రవర్తులు, రాజపుత్రుల కూతుళ్ల మధ్య వివాహాలకు ఈ గుజియాలను ఎక్కువగా వడ్డించేవారని చెప్పుకుంటారు.

కజ్జికాయ‌లకి కావాల్సిన ప‌దార్థాలు:

మైదాపిండి

రవ్వ

ఉప్పు

నెయ్యి

పుట్నాలు

ఎండు కొబ్బరి

యాలకులు

నూనె

కజ్జికాయ‌ల తయారీ విధానం..

మైదాపిండి శుభ్రంగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి రవ్వ, ఉప్పు, నెయ్యి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత ఈ ముద్దపైన నూనెరాసి మూత పెట్టి ప‌క్క‌న పెట్టుకోవాలి.

స్టఫింగ్‌ తయారీ

కొబ్బ‌రి ముక్క‌లు, యాల‌కులు, పుట్నాల పప్పు నెయ్యితో దోరగా వేయించుకోవాలి. దీన్ని మెత్త‌గా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో బెల్లం ఆర్గానిక్‌ బెల్లం పౌడర్‌ లేదంటే మెత్తగా చేసుకున్న చక్కెర పొడి ,యాలకుల పొడి వేసి బాగా కలిపి ప‌క్క‌కు పెట్టుకోవాలి. కావాలంటే దీంట్లో రుచి కోసం జీడిపప్పు, బాదం పలుకులను కూడా యాడ్‌ చేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి, బెల్లం, యాలకులు, జీడిపప్పుతో తయారు చేసినకొబ్బరి లౌజును కూడా వాడుకోవచ్చు.

ఇపుడుముందుగానే కలిపి ఉంచుకన్న చపాతీ పిండిని చపాతీలాగా ఒత్తుకుని, కజ్జికాయలు ఒత్తుకునే (మౌల్డ్‌) చెక్కపై ఉండి, మధ్యలో రెడీ చేసిపెట్టుకున్న స్టఫింగ్‌ వేసి ప్రెస్‌ చేసుకోవాలి. లేదంటే చపాతీ మధ్యలో స్టఫింగ్‌ పెట్టి, మడిచి అంచుల్లో ఫోర్క్‌తో డిజైన్ వ‌త్తుకుంటే సరిపోతుంది. ఇపుడు స్టవ్‌మీద బాండ్లీ పెట్టుకుని, నూనె పోసి బాగా వేడెక్కిన తరువాత ఒత్తి పెట్టుకున్న కజ్జికాయలను, మంచి రంగు వచ్చేదాకా తక్కువమంటపై వేయించుకోవాలి. అంతే కజ్జికాయలు రెడీ. చల్లారిన తరువాత వీటిని ప్లాస్టిక్‌ లేదా స్టీల్‌ డబ్బాల్లో ఉంచుకోవాలి.

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!