Turmeric Side Effects: ఆరోగ్యానికి మంచిదని పసుపును ఎక్కువగా వాడేస్తున్నారా ? శ్రుతి మించితే యమ డేంజర్..
Turmeric Side Effects: మన భారతీయ వంటశాలలో పసుపు అతి ముఖ్యమైంది. ప్రతి వంటకాలలో పసుపును ఉపయోగిస్తుంటాం. అయితే ప్రస్తుతం కరోనా
Turmeric Side Effects: మన భారతీయ వంటశాలలో పసుపు అతి ముఖ్యమైంది. ప్రతి వంటకాలలో పసుపును ఉపయోగిస్తుంటాం. అయితే ప్రస్తుతం కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకకోవడంతోపాటు.. ఇతర అనారోగ్య సమస్యలను … యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా.. శరీరానికి తగిలిన గాయాలను తగ్గించడానికి సహయపడుతుంది. అయితే మోతాదు మించితే ఏదైనా ప్రమాదమే.. అలాగే పసుపు కూడా అధికంగా తీసుకుంటే శరీరంలో ఐరన్ లోపం జరుగుతుంది.
పసుపు శరీరంలోని మంటను తగ్గించడంతోపాటు.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో ఐరన్ లోపం సంభవిస్తుంది. ఐరన్.. రక్తంలోని హిమోగ్లోబిన్ తయారీకి ఉపయోగపడుతుంది. రక్తంలోని ఆక్సిజన్ ను ఒకచోటు నుంచి మరోక చోటికి ప్రవేశించడానికి సహయపడుతుంది. అయితే పసుపు శరీరంలో 20 నుంచి 30 శాతం ఐరన్ పీల్చుకుంటుంది. ఇందుకు కారణం.. పసుపులోని స్టోయికియోట్రిక్ అనే గుణాలు. దీనివలన ఐరన్ లోపం సంభవిస్తుంది.
ఎంత పసుపు తినాలి.. ఆహారంలో 2000 నుంచి 2500 మిల్లీ గ్రాముల పసుపును ఉపయోగించాలి. అంటే ఒకరోజులో 60 నుంచి 100 మిల్లీ గ్రాముల కర్కుమిన్ తీసుకున్నట్లుగా అర్థం. కర్కుమిన్ శరీరానికి మంచిది. అయితే పసుపు శృతి మించితే హానికరం.
ఐరన్ లోపం ఉన్నప్పుడు ఎక్కువగా కర్కుమిన్ తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు, తలనొప్పి, చర్మ దద్దుర్లు వస్తాయి. పసుపు అధికంగా తీసుకోవడం వలన కాలేయం, కడుపు పూతలు, మంట వస్తుంటాయి. అంతేకాకుండా.. కాలేయం, పెద్ద పేగు క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంది.
పసుపులోని కర్కుమిన్ ఆరోగ్యానికి మంచిది. అయితే కర్కుమిన్ సప్లిమెంట్స్ రూపంలో లభించదు. రక్తహీనత, రక్త సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు కర్కుమిన్ తీసుకోకూడదు.
మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పువ్వాడ.. రూ.35 లక్షల చెక్కులు, ఉద్యోగ నియామక పత్రం అందజేత..