AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Cholesterol: ఎంత ట్రై చేసినా కొలెస్ట్రాల్ తగ్గడం లేదా? అసలు కారణాలు ఇవే.. ఓ లుక్కేయండి..

కొలెస్ట్రాల్ అనేది మన రక్తంలో ఉండే మైనపు లాంటి పదార్థం. కొలెస్ట్రాల్ స్థాయి 200 mg/dL కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అధిక కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది.

High Cholesterol: ఎంత ట్రై చేసినా కొలెస్ట్రాల్ తగ్గడం లేదా? అసలు కారణాలు ఇవే.. ఓ లుక్కేయండి..
Cholesterol
Venkata Chari
|

Updated on: Feb 18, 2023 | 8:09 AM

Share

కొలెస్ట్రాల్ అనేది మన రక్తంలో ఉండే మైనపు లాంటి పదార్థం. కొలెస్ట్రాల్ స్థాయి 200 mg/dL కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అధిక కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్), చెడు కొలెస్ట్రాల్ (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) అనే రెండు రకాల కొలెస్ట్రాల్‌లు కనిపిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తుంటారు. ధమనులలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల రక్తం సరైన మోతాదులో గుండెకు చేరదు. దానివల్ల గుండెపోటు, స్ట్రోక్ మొదలైన వాటి ప్రమాదం పెరుగుతుంది. రక్తపరీక్ష ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.

అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి తప్పనిసరి. కానీ చాలా సార్లు ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అనుసరించినప్పటికీ, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గదు. దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆహారంలో ప్రమాదకరమైన కొవ్వులు దాగి ఉండవచ్చు- కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తుంటారు. ఆరోగ్యకరమైన ఆహారంలో ఎటువంటి కొవ్వు ఉండదని భావిస్తుంటారు. కానీ వైద్యులు అసంతృప్త కొవ్వు, ద్రవ కొవ్వు ఆరోగ్యానికి ప్రయోజనకరమని, సంతృప్త కొవ్వు శరీరానికి హానికరమని నిరూపిస్తుందని చెబుతుంటారు. ఇది కాకుండా, ట్రాన్స్ ఫ్యాట్ అని పిలువబడే మరొక కొవ్వు ఉంది. ఈ కొవ్వును పెద్దగా పట్టించుకోరు.

ఇవి కూడా చదవండి

ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఈ రోజుల్లో ప్రతిదానిలో ఉపయోగించే కొవ్వు. ఇది చాలా అనారోగ్యకరమైనదిగా పరిగణిస్తుంటారు. ఇటువంటి పరిస్థితిలో సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ ఉన్న కొవ్వును అస్సలు తీసుకోకపోవడం చాలా ముఖ్యం.

కీటో డైట్‌ వద్దు- కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి తరచుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. కానీ, కొన్నిసార్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఈ ఆహారం సరిపోదు. కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవారు కీటో డైట్‌ చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. సరైన డైట్ కోసం డాక్టర్లను సంప్రదించడం చాలా మంచిది.

పూర్తి ప్రణాళిక- కేవలం జీరో ఫ్యాట్ డైట్, ఆర్గానిక్ కూరగాయలను తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించలేం. దీనికి పూర్తి ప్రణాళిక అవసరం. దీని కోసం మీరు మీ శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం, మందులను జాగ్రత్తగా తీసుకోవడం చాలా ముఖ్యం.

శారీరకంగా చురుకుగా ఉండకపోవడం- ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తుంటారు. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవాలి.

ఆల్కహాల్ సేవించడం- ఆల్కహాల్ సేవించడం కొలెస్ట్రాల్ స్థాయిపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. మీరు రోజూ కొలెస్ట్రాల్ మందులు తీసుకుంటూ, ఆల్కహాల్ తాగితే, ఆ మందులు మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపవు.

సరైన మోతాదులో మందులు తీసుకోకపోవడం- కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించకపోవడానికి మరో ప్రధాన కారణం సరైన మోతాదులో మందులు తీసుకోకపోవడం. మీరు మీ కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేసి, నివేదికను వైద్యులకు చూపించడం చాలా ముఖ్యం. వైద్యులు ఇచ్చిన మందులను సరైన మోతాదులో, సమయానికి తీసుకోండి.

మరిన్ని ఆరోగ్య వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..