Diabetes: షుగర్‌ పేషెంట్లకు గుడ్ న్యూప్.. పాలలో వీటిని నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు..!

పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. అటువంటి పోషకాలను అందించేవాటిలో పిస్తా పప్పులు..

Diabetes: షుగర్‌ పేషెంట్లకు గుడ్ న్యూప్.. పాలలో వీటిని నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు..!
Pistachios For Diabetes
Follow us

|

Updated on: Feb 17, 2023 | 8:11 PM

ప్రస్తుత కాలంలో మానవాళిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. అటువంటి పోషకాలను అందించేవాటిలో పిస్తా పప్పులు కూడా ప్రముఖమైనవి. పిస్తాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బి6, ప్రొటీన్, కాల్షియం, ఐరన్ పెద్ద మొత్తంలో లభిస్తాయి. రోజూ పిస్తాపప్పును తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలోని షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండడంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే చాలా మంది పిస్తాపప్పును నీటిలో నానబెట్టి తింటారు. కానీ పిస్తాపప్పును పాలలో మరిగించి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మరి దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కండరాలు బలోపేతం: పిస్తాపప్పులు, పాలు కలిపి తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. ఎందుకంటే ఈ కాంబినేషన్‌లో కండరాలను బలోపేతం చేసే ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని రోజు తీసుకోవాలి.

ఎముకలు దృఢత్వం: పిస్తా పప్పులను పాలలో మరిగించి తింటే ఎముకలకు బలం చేకూరుతుంది. ఎందుకంటే పాలు పిస్తాలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు ఉపయోగకరంగా ఉంటుంది. పిస్తాలను పాలలో మరిగించడం వల్ల కీళ్ల నొప్పులు దూరమవుతాయి.

ఇవి కూడా చదవండి

కళ్లకు ప్రయోజనాలు: మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో నిరంతరం పనిచేసే వ్యక్తుల కళ్లపై చెడు ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు పిస్తాలను పాలలో ఉడికించి తినవచ్చు. దీనివల్ల కళ్లకు మేలు జరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్‌: పిస్తా పాలు కలిపి తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. పాలలో ఉడకబెట్టిన లేదా నానబెట్టిన పిస్తా పప్పులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అలాగే అనేక రకాల పోషకాలు అందడం వల్ల దృఢంగా ఉండగలుగుతారు.

Latest Articles
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది