Gulkand Mousse: గుల్కంద్ పాన్‌తోనే కాదు.. ఇలా కూడా తీసుకోండి.. వేసవిలో చల్లని ఆరోగ్యాన్నిస్తుంది!
Healthy Gulkand Drink: గుల్కంద్ తినడానికిరుచికరంగా.. చల్లగా ఉంచడంలో చాలా మేలు చేస్తుంది. గుల్కంద్ పాన్ తోపాటు కొన్ని పద్దతుల్లో తింటే చాలా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.
Healthy Gulkand Drink: గుల్కంద్ తినడానికిరుచికరంగా.. చల్లగా ఉంచడంలో చాలా మేలు చేస్తుంది. గుల్కంద్ పాన్ తోపాటు కొన్ని పద్దతుల్లో తింటే చాలా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. గుల్కంద్ వేసవిలో ఇది ఆరోగ్యానికి వరం లాంటిది. కడుపుని చల్లబరచడంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేడి కారణంగా ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం, పుల్లని తేపులు వంటి సమస్యలను నివారిస్తుంది. అలాగే మైండ్ ఫ్రెష్ గా మారుతుంది. సాధారణంగా ప్రజలు గుల్కంద్‌ను పాన్‌లో కలిపి తింటారు. కానీ వేసవిలో ఇంట్లోనే గుల్కంద్ మౌసీ (పానీయం) ని తయారు చేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని పేర్కొంటున్నారు. ఈ (gulkand mousse) పానీయం శరీరంలో నీటి కొరతను నివారించడంతోపాటు శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో మీ ఇంటికి ఎవరైనా అతిథిలు అకస్మాత్తుగా వస్తే.. ఈ రుచికరమైన పానీయాన్ని అందించవచ్చు. గుల్కంద్ పానీయం (Gulkand Mousse Recipe) ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు..
500 ml తాజా క్రీమ్, 70 గ్రాముల గుల్కంద్, 150 ml పాలు, రెండు టేబుల్ స్పూన్ల థండాయ్, 100 ml కండెన్స్డ్ మిల్క్, ఒక టేబుల్ స్పూన్ తరిగిన పిస్తా.
ఎలా చేయాలంటే
గుల్కంద్ పానీయం తయారు చేయడం చాలా సులభం. ఇలా చేయడానికి ముందుగా మిక్సీలో పాలు పోసి అందులో థండాయ్ పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో వేయాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో కండెన్స్‌డ్ మిల్క్, థండాయ్, క్రీమ్ వేసి బాగా కలపాలి . ఇది స్మూత్ అయ్యే వరకు కలపాలి. మెత్తగా అయ్యాక ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులో పోసి గుల్కంద్, పిస్తాతో గార్నిష్ చేయాలి.
ఆ తర్వాత ఫ్రిజ్‌లో ఉంచండి. సుమారు ఒక గంట పాటు లేదా బాగా చల్లగా అయ్యేవరకు ఉంచాలి. ఆ తర్వాత చల్లని పానీయం రెడీ అయినట్లే. దీన్ని తాగిన తర్వాత శరీరం చల్లబడుతుంది. దీంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందవచ్చు.
గుర్తుంచుకోవాల్సినవి..
పాలు, థండాయ్ కలపడానికి, చల్లని పాలు మాత్రమే ఉపయోగించాలని గుర్తుంచుకోండి. గోరువెచ్చని లేదా వేడి పాలు కాదు. తద్వారా ఫ్రిజ్‌లో ఉంచితే బాగా చల్లబడుతుంది. పిస్తా కాకుండా మీరు ఏదైనా డ్రై ఫ్రూట్ కూడా ఉపయోగించి ట్రై చేయవచ్చు.
Also Read: