పండ్లు తింటే ప్రయోజనమే కాదు నష్టాలు కూడా..! ఈ విషయం తెలిస్తే నిజమే అంటారు..?

Fruits Side Effects: పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి అతి పెద్ద కారణం అవి సహజసిద్ధమైన గుణాలు కలిగి

పండ్లు తింటే ప్రయోజనమే కాదు నష్టాలు కూడా..! ఈ విషయం తెలిస్తే నిజమే అంటారు..?
Eat Fruits
Follow us

|

Updated on: Dec 31, 2021 | 4:46 PM

Fruits Side Effects: పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి అతి పెద్ద కారణం అవి సహజసిద్ధమైన గుణాలు కలిగి ఉండటమే. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి. కూరగాయల కంటే పండ్లు ఎక్కువ మేలు చేస్తాయి. ఎందుకంటే పండ్లను సహజసిద్దంగా తింటాం కానీ కూరగాయలను ఉడికించి తింటాం. మంట మీద వండటం వల్ల కూరగాయలలోని అనేక ముఖ్యమైన పోషకాలు నాశనం అవుతాయి దాని సహజ రూపాన్ని నిలుపుకోలేవు.

పండ్ల అతి పెద్ద లక్షణం ఏంటంటే మనం వాటిని ఉడికించకూడదు. పండ్లు ప్రకృతిలో ఏ రూపంలో ఉంటాయో అదే రూపంలో తింటారు. అందుకే చెట్టు నుంచి నేరుగా తిన్న పండుకి దుకాణంలో కొని తిన్న పండుకి తేడా ఉంటుంది. అయితే ఈరోజు మనం తింటున్న పండ్లు స్వచ్ఛమైనవి కాదని పరిశోధకులు చెబుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం పండ్లను పండించే విధానం వేరుగా ఉండేది. అవి ఆరోగ్యానికి ఎంతో పోషకంగా ఉండేవని పరిశోధకులు చెబుతున్నారు. కానీ నేడు మార్కెట్‌లో అమ్ముతున్న పండ్లలో పెద్ద మొత్తంలో పురుగుమందుల అవశేషాలు, వివిధ రకాల రసాయనాలు ఉంటున్నాయి. అవి శరీరానికి ప్రయోజనం కంటే అధికంగా హాని చేస్తున్నాయి.

కూరగాయలలో పురుగుమందులు, రసాయనాలు విరివిగా ఉపయోగిస్తారు. అయితే కూరగాయలను వండుకుని తినడం వల్ల అందులో ఉండే పురుగుమందుల ప్రభావం వేడికి చాలా వరకు తగ్గుతోంది. కానీ పండ్ల విషయంలో ఇది జరగడం లేదు. ఎందుకంటే పండ్లను ఉడికించలేము కదా.. అవి పచ్చిగానే తినాలి. వీలైనంత వరకు పురుగుమందులు, యూరియా వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లను మాత్రమే తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. సేంద్రీయ పండ్లు అందుబాటులో లేకుంటే పండ్లను తినవద్దు. ఇప్పుడున్న పండ్లలో అటువంటి పోషకాలు లేవు. ఒకవేళ తప్పనిసరైతే పండ్లను తినడానికి ముందు వీలైతే వాటిని కనీసం ఒక గంట పాటు నీటిలో నానబెట్టి బాగా కడగాలి. దీని వల్ల దాని బయటి చర్మంపై ఉండే పురుగుమందుల అవశేషాలు, రసాయనాల ప్రభావం కొంతమేరనైనా తగ్గుతుంది.

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్ ది ఇయర్‌ రేసులో పాకిస్తాన్‌ ప్లేయర్స్‌.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?

మీకు సైన్స్‌ అంటే భయమా..! కెరీర్‌లో ఎదగడానికి ఇంకా చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి..? అవేంటో తెలుసుకోండి..

CLAT Exam 2022: ‘లా’ చదవాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. జనవరి 1 నుంచి CLAT రిజిస్ట్రేషన్ ప్రారంభం..