మీకు సైన్స్‌ అంటే భయమా..! కెరీర్‌లో ఎదగడానికి ఇంకా చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి..? అవేంటో తెలుసుకోండి..

Career News: మీకు సైన్స్ చదవాలని అనిపించకపోతే దాని గురించి చింతించాల్సిన పని లేదు. జీవితంలో ఏదో ఒక మంచి జరుగుతుంది. నిజానికి కెరీర్‌ని

మీకు సైన్స్‌ అంటే భయమా..! కెరీర్‌లో ఎదగడానికి ఇంకా చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి..? అవేంటో తెలుసుకోండి..
Career
Follow us
uppula Raju

|

Updated on: Dec 31, 2021 | 3:40 PM

Career News: మీకు సైన్స్ చదవాలని అనిపించకపోతే దాని గురించి చింతించాల్సిన పని లేదు. జీవితంలో ఏదో ఒక మంచి జరుగుతుంది. నిజానికి కెరీర్‌ని సెట్ చేసుకోవడానికి పేరు, డబ్బు సంపాదించడానికి చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి. మీ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా సబ్జెక్ట్ లేదా ఫీల్డ్‌ని ఎంచుకోవచ్చు. మీరు ఆ రంగంలో ఇతరులకన్నా మెరుగ్గా రాణిస్తారు. అవకాశాలు మీ అధీనంలో ఉంటాయి విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. సైన్స్ చదవకపోతే జీవితంలో ఎదగలేమనే భావన విడనాడండి. మీకు నచ్చిన కోర్సును చేయకపోతే కెరీర్‌లో ఒత్తిడిని అనుభవించవచ్చు. మంచి కళాశాల రాకపోతే విద్యార్థులు నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితి చాలాసార్లు కనిపించింది. అయితే నిరాశ చెందడం కెరీర్‌కు మంచిది కాదు. మరింత వ్యూహాన్ని పదునుపెట్టండి. భవిష్యత్‌ మీ కోసం అవకాశాల తలుపులు తెరుస్తుంది.

మీకు కెరీర్‌లో డిజైనింగ్‌పై ఆసక్తి ఉంటే సంకోచం లేకుండా గ్రాఫిక్ డిజైనింగ్ చదవండి. ఈ రోజుల్లో ఫ్రీలాన్సర్లు ఈ రంగంలో అత్యధికంగా సంపాదిస్తున్నారు. మీరు గేమ్‌ని డిజైన్ చేయాలనుకుంటే సంబంధిత మెటీరియల్‌ల కోసం పరిశోధించండి. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పొందడం ప్లస్ పాయింట్ అవుతుంది. కొన్ని కారణాల వల్ల మీరు దీన్ని చేయలేకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మీ వద్ద అందుబాటులో ఉన్న వాటి బలంతో ముందుకెళ్లండి. మీకు మంచి ఉద్యోగం రాకుండా ఎవరూ ఆపలేరు.

మీ ఆసక్తుల గురించి మీకు అవగాహన ఉంది. మీరు కనే కలల వెంట పరుగెత్తవచ్చు. ఐఐటీలో కూడా అలాంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు కానీ వారు ఏమి కావాలనుకుంటున్నారో వారికి తెలియదు. ప్రసిద్ధ కళాశాల లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి మీకు నచ్చిన డిగ్రీని పొందడానికి మీరు కష్టపడి పనిచేయడం ఉత్తమం. కాలేజీలో మీలాంటి విద్యార్థులు ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉంది. వారి ఆసక్తులు , నేపథ్యాలు మీతో సమానంగా ఉండవచ్చు. అలాంటి వారిని కలవండి మీ కలలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి.

మీకు సైన్స్ అంటే ఇష్టం లేకపోతే ఎవరి ఒత్తిడికి లోనై ఈ సబ్జెక్ట్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. బలవంతంగా చదివితే ప్రయోజనం ఉండదు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సైన్స్ చదవమని సలహా ఇవ్వడం లేదా కొన్ని సందర్భాల్లో పదే పదే ఒత్తిడి చేయడం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల కెరీర్ ముగిసే సమయానికి చాలా బాధపడుతారు. మీకు ఇలాంటి పరిస్థితి ఉంటే మీ కుటుంబ సభ్యులతో మీ అభిరుచులు, ఇష్టాయిష్టాల గురించి చర్చించడం ఉత్తమం.

CLAT Exam 2022: ‘లా’ చదవాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. జనవరి 1 నుంచి CLAT రిజిస్ట్రేషన్ ప్రారంభం..

అమెరికా నుంచి బ్రెజిల్‌ వరకు ఆంక్షల మధ్య న్యూ ఇయర్ వేడుకలు.. కొన్ని పరిమితులు మాత్రమే..

Lungs: ఊపిరితిత్తుల ఆరోగ్యంగా కోసం ఈ ఆహారాలు తప్పనిసరి.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.