ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ రేసులో పాకిస్తాన్ ప్లేయర్స్.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?
ICC Player of the Year: ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అంటే సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీకి పోటీదారుల పేర్లను ప్రకటించింది. 2021 సంవత్సరానికి
ICC Player of the Year: ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అంటే సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీకి పోటీదారుల పేర్లను ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ బెస్ట్ ప్లేయర్ అవార్డుకు ఎంపికైన ఆటగాళ్లలో ఇద్దరు పాకిస్థాన్‌కు చెందినవారే. మిగతా ఇద్దరు బయటి దేశాల వారు. ఈసారి ఈ అవార్డు రేసులో పాక్ ఆటగాళ్లదే ఆధిపత్యం కనిపిస్తోంది. నలుగురు ఆటగాళ్లలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన షహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. ఈ నలుగురు ఆటగాళ్లు మాత్రమే సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డుకు నామినేట్ అయ్యారు.
1. మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ ఈ ఏడాది ఆడిన 44 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 56.32 సగటుతో 1915 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 2 అర్ధ సెంచరీలు సాధించాడు. రిజ్వాన్ ఈ ఏడాది మొత్తం నిలకడగా క్రికెట్ ఆడుతున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వికెట్ ముందు చేసిన ఈ ఫీట్‌తో పాటు వికెట్ వెనుక నుంచి కూడా చాలా చేశాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్ కీపింగ్‌లో రిజ్వాన్ 56 వికెట్లు పడగొట్టాడు.
2. షాహీన్ షా ఆఫ్రిది (పాకిస్థాన్) పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో 78 వికెట్లు పడగొట్టాడు. అతను 36 మ్యాచ్‌ల్లో 20.20 సగటుతో ఈ వికెట్లు తీశాడు. ఈ సమయంలో షాహీన్ ఆఫ్రిది అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ 51 పరుగులకు 6 వికెట్లు తీయడం. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించడంలో షాహీన్ షా అఫ్రిది కీలక పాత్ర పోషించాడు. అతను భారత 3 పెద్ద బ్యాట్స్‌మెన్ KL రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లు తీశాడు.
3. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ ఏడాది 16 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 693 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 1 సెంచరీ చేశాడు అతని సగటు 43.31.
4. జో రూట్ (ఇంగ్లండ్) ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఈ ఏడాది 18 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 1855 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాటింగ్ సగటు 58.37. అతను 6 సెంచరీలు చేశాడు.