Jackfruit Day : ఆరోగ్యానికి మేలు చేసే పనస పండు.. లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
పనసలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పనస పండులో ఫైబర్ ఎక్కువగా ఉండి.. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది హెల్తీ స్నాక్‌గా చెప్పవచ్చు. పనస పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.

పనస పండు..చూసేందుకు భారీ సైజులో కనిపించే ఈ పండు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పనస పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పనస తొనలు తినడానికి తియ్యగా, ఎంతో రుచిగా ఉంటాయి. అంతేకాదు.. పనస తొనలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. మైక్రోన్యూట్రెంట్స్, విటమిన్ సి, ఏ, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ నిండుగా ఉంటాయి. పనస పండు తినటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి సీజనల్ వ్యాధులు రాకుండా ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేసి గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ సమస్యలను దూరం చేసి.. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
పనసలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పనస పండులో ఫైబర్ ఎక్కువగా ఉండి.. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది హెల్తీ స్నాక్‌గా చెప్పవచ్చు. పనస పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. పనస పండులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యఛాయలను దూరం చేస్తాయి. గ్లోయింగ్ స్కిన్‌ని అందిస్తాయి.
గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్ ఉంటుంది. ఈ రెండూ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. పనస పండులో కాల్షియం, మెగ్నీషియ, విటమిన్ కె బోన్ సమస్యల్ని దూరం చేస్తాయి. ఎముకలను స్ట్రాంగ్‌గా చేసి బలాన్ని అందిస్తాయి.
పనస పండులో విటమిన్ ఎ, కారోటెనోయిడ్స్ కంటి చూపును మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్లో తీసుకుంటే మంచిది. అంతేకాకుండా పనస గింజలు, పనస పట్టు కూడా ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఇస్తుంది. పర్యావరణానికి కూడా ఇది మేలు చేస్తుంది కాబట్టే పనసను ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..