పిచ్చి ఆకులు అనుకుంటున్నారా.. ఔషధాల గని.. ఇలా తాగితే ఆ సమస్యలు ఇట్టే మటాష్
Fig Leaf Tea Recipe: అంజీర్ పండ్లు రుచితో పాటు ఎన్నో ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందాయి. అయితే, అంజూర చెట్టు ఆకులు అనేక ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి చెందాయని చాలామందికి తెలియదు. ఈ ఆకులతో టీ తయారు చేసి తాగడం ఆరోగ్యానికి మంచిది మాత్రమే కాదు, శరీరానికి కొత్త ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Fig Leaf Tea Recipe: అంజీర్ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ, చాలా మందికి అంజీర్ ఆకుల్లోనూ అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని తెలియదు. ఒకవేళ తెలిసినా ఈ అంజీర్ ఆకులను ఎలా ఉపయోగించాలో తెలియదు. వీటిని ఉపయోగించడానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం అంజీర్ ఆకులతో టీ తయారు చేయడం. ఇది చాలా వింతగా అనిపించినప్పటికీ, ఇది డయాబెటిస్ నిర్వహణకు ఒక అద్భుతమైన సాధనంగా పనిచేస్తోంది. ఈ ఆకు ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదు. కాబట్టి, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అంజూర ఆకు టీ తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు..
తాజా లేదా ఎండిన అంజూర ఆకులు
నీళ్లు
తయారు చేసే విధానం: అంజీర్ ఆకులు తాజాగా ఉంటే చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. లేదా ఎండిన ఆకులను ఉపయోగిస్తుంటే, అవి ఇప్పటికే ఉడకబెట్టడానికి రెడీగా ఉంటాయి.
ఒక కప్పు టీకి ఒక టీస్పూన్ తరిగిన అంజూర ఆకులను జోడించాలి.
నీటిని బాగా మరిగించి, దానికి అంజీర్ ఆకులను వేసి, వాటిని దాదాపు 15 నిమిషాలు మరిగించాలి. ఈ ప్రక్రియ ఆకుల నుంచి ఉపయోగకరమైన సమ్మేళనాలను తీయడంలో సహాయపడుతుంది.
బాగా మరిగిన తర్వాత, మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. దీంతో వేడి టీ సిద్ధమైనట్లే.
ఈ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి రోజుకు 1-2 కప్పులు తాగవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. ఈ టీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, శరీరాన్ని ప్రశాంతపరచడంలో కూడా సహాయపడుతుంది. ఈ టీని రోజులో ఏ సమయంలోనైనా ఆస్వాదించవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి..