AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panasa Pottu Kura: ఆంధ్రా స్పెషల్ ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా..

పండ్లలో పనస కాయ వెరీ వెరీ స్పెషల్. ఈ పనస కాయల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కూరకు ఉపయోగించేవి.. రెండో రకం తొనలు తినేవి. పనస పొట్టు దొరికే సమయంలో గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంద్రలో కూడా తప్పని సరిగా పనస పొట్టు కూరని తయారు చేస్తారు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లలో తప్పని సరిగా పనస పొట్టు కూరకు ప్రత్యెక స్థానం ఉంటుంది. ఈ రోజు గోదావరి జిల్లా స్టైల్ లో టేస్టీగా పనస పొట్టు కూర తయారు తెలుసుకుందాం..

Panasa Pottu Kura: ఆంధ్రా స్పెషల్ ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా..
Panasa Pottu Ava Kura
Surya Kala
|

Updated on: Dec 27, 2024 | 1:17 PM

Share

సాధారణంగా పనన పొట్టు దొరికే కాలంలో పనస పొట్టు కూరని ఒక్కసారైనా తినాలని కోరుకుంటారు. అయితే దీనిని తయారు చేయడం ఒక ఆర్ట్ అని అంటారు పెద్దలు. ఎందుకంటే కూర పనసను గుర్తించడం దగ్గర నుంచి పనస కాయను పొట్టు కొట్టడం.. దానిని కూరగా వండడం అత్యంత శ్రద్దగా ఇష్టంగా చేయాల్సి ఉంటుంది. పనస కాయను పనన పొట్టుగా కొట్టడానికి ప్రత్యేకమైన కత్తి కూడా ఉంటుంది. ఈ పనస కత్తితో అత్యంత శ్రద్దగా ఓపికగా పొట్టు కొట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే పనసని చిన్న చిన్న ముక్కలుగా కొడుతూ ఆ పోట్టుకు కొంచెం నూనె, పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా పట్టిస్తారు. ఇక పనస పొట్టు దొరికే సీజన్ లో గోదావరి జిల్లాలలో ప్రతి వీధిలో సైకిల్ మీద పనస పొట్టు అమ్మేవారు వస్తూ ఉంటారు. అయితే ఎవరికైనా ఆవ పెట్టిన పనస పొట్టు కూర తినాలని కోరుకుంటే.. ఆ రేసీపీని ఈ రోజు తెలుసుకుందాం..

పనస పొట్టు కూర తయారీకి కావల్సిన పదార్ధాలు

పనస పొట్టు – పావు కిలో

చింతపండు- గుజ్జు అర కప్పు (వేడి నీళ్ళని చింత పండులో వేసి చిక్కగా రసం తీసుకోవాలి)

ఇవి కూడా చదవండి

జీడిపప్పు- 8

పచ్చిమిరపకాయలు – 6 (నిలువుగా చీల్చుకోవాలి)

కరివేపాకు – నాలుగు రెమ్మలు .

తాలింపు కోసం

ఆవాలు – స్పూను.

పచ్చిశనగపప్పు – మూడు స్పూన్లు.

చాయమినపప్పు – స్పూనున్నర.

ఎండుమిరపకాయలు – 8

నువ్వుల నూనె – తయారీకి కావలసినంత

కారము – స్పూను .

పసుపు – పావు స్పూను.

ఉప్పు – రుచికి సరిపడా

ఇంగువ – పావు స్పూను లో సగం.

తయారీ విధానం: పనస పొట్టు కూర తయారు చేసే ముందు ఆవ తయారు చేసుకోవాలి. మిక్సి గిన్నె తీసుకుని ఒక స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి, పసుపు , ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఆవని రెడీ చేసుకుని ఒక కప్పులోకి ఆవని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి.. అందులో పనస పొట్టు వేసి తగినంత నీరు వేసి మెత్తగా ఉడికించాలి. ఇలా ఉడికించిన పనస పొట్టుని నీరు లేకుండా వార్చుకోవాలి. నీరు పిండిన పనస పొట్టును ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిని స్టవ్ మీద పెట్టి తగినంత నూనె పోసుకుని వేడి ఎక్కిన తర్వాత పచ్చి మిర్చి ముక్కలు, ఎండు మిరపకాయల ముక్కలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి చివరగా జీడిపప్పు వేసి పోపునీ వేయించుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన పనస పొట్టుని వేసి బాగా కలిపి తక్కువ మంట మీద మగ్గనివ్వాలి. తర్వాత పనస పొట్టు కూరలో ఆవ వేసి తర్వాత నూనె వేసి కూరని బాగా కలపాలి. అంతే గోదావరి జిల్లా స్పెషల్ టేస్టీ టేస్టీగా ఆవ పెట్టిన పనస పొట్టు కూర రెడీ.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..