Astro Tips: అనురాధ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు వెరీ వెరీ స్పెషల్.. స్త్రీ, పురుషుల స్వభావం, ప్రత్యేకతలు ఏమిటంటే
జ్యోతిషశాస్త్రంలో అనురాధ 17వ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కృతనిశ్చయంతో ఉంటారు. మొండి పట్టుదలగలవారు, ధైర్యవంతులు. చాలా సహనం కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం, స్వభావం , జీవితానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.
జ్యోతిషశాస్త్రంలో 27 నక్షత్రాలకు సంబంధించిన వివరణ ఉంది. ఈ నక్షత్రాలలో అనూరాధ ఒకటి. ఇది నక్షత్రాలలో 17వ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు సృజనాత్మకత కలిగి ఉంటారు. న్యాయం జీవించాలని కోరుకుంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు దృఢ సంకల్పం, ధైర్యం , దృఢ నిశ్చయంతో ఉంటారు. జీవితంపై లోతైన అవగాహన కలిగి ఉంటారు.
పరిస్థితిపై అవగాహన కలిగి ఉండే నేచర్..
అనూరాధ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. చాలా కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎలా నిర్వహించాలో వీరికి బాగా తెలుసు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఏదైనా పని చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. ఈ అలవాటు కొన్నిసార్లు వీరు వెనుకబడి ఉండటానికి ఒక కారణం అవుతుంది. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైతే.. వీరు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. సామాజికంగా కలివిడిగా ఉంటారు. వీరికి చాలా మంది స్నేహితులు కూడా ఉంటారు.
వృత్తి, వ్యాపారం
అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి వ్యాపారం లాభదాయకం. అనూరాధ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు జ్యోతిష్కులు, ఫోటోగ్రాఫర్లు, శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రజ్ఞులు, డేటా నిపుణులు, న్యూమరాలజీ నిపుణులు అవుతారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు సినిమా, విదేశీ వ్యాపారంలో కూడా మంచి విజయాన్ని పొందుతారు.
వ్యక్తిత్వం
అనురాధ నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం గురించి మాట్లాడినట్లయితే.. పురుషులు అయితే కుటుంబం, స్నేహితుల పట్ల అంకితభావంతో ఉంటారు. విమర్శనాత్మకంగా, చంచలంగా, కోపంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన పురుషుల ప్రతికూల ప్రభావాన్ని జయిస్తారు. అదే విధంగా స్త్రీలు తమ పనిని నిజాయితీగా చేస్తారు. చాలా కష్టపడి పనిచేస్తారు.
ఆరోగ్యం
ఈ నక్షత్రంలో పుట్టిన వారు మంచి ఆరోగ్యంగా ఉంటారు. పురుషులు కొన్నిసార్లు దంత సమస్యలు, జలుబు, మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రుతుక్రమానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు.
సంబంధాలు
ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు తమ తల్లిదండ్రులతో చాలా స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన పురుషుల ఆలోచనలు కొంచెం పూర్వకాలంవి అనిపిస్తాయి. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు బంధాలకు విలువ ఇస్తారు. సంబంధాల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.