Bottle Gourd: ఆరోగ్యానికి మేలు చేసే సొరకాయతో ఎన్నో వంటకాలు.. ఇలా ట్రై చేస్తే రుచి అదుర్స్..
ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎక్కువగా తమ ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తున్నారు. దీంతో చాలావరకు ప్రతి ఒక్కరి జీవన శైలి మారిపోయింది.

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎక్కువగా తమ ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తున్నారు. దీంతో చాలావరకు ప్రతి ఒక్కరి జీవన శైలి మారిపోయింది. జంక్ ఫుడ్ కాకుండా.. సహజ వనరులతో ఇంట్లో చేసిన పదార్థాలను తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కొందరు ఇంట్లో చేసే వంటకాలలో కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ఇష్టముండదు. పిల్లల నుంచి పెద్ద వారి వరకు కొన్ని పదార్థాలను అస్సలు తినరు. అందులో సొరకాయ ఒకటి. ఈ కూరగాయ తినేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించరు. కానీ దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఆయుర్వేదంలో సూపర్ ఫుడ్‌గా భావిస్తారు. కడుపు సమస్యలను తగ్గించడమే కాకుండా.. వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. జీవక్రియ రేటు పెంచడానికి పనిచేసే విటమిన్స్ అధికంగా ఉంటాయి. శరీరంలోని కొవ్వు, ప్రోటీన్, షుగర్ జీర్ణం చేయడానికి ఇది సహాయపడుతుంది. అయితే దీనిని కాస్త డిఫరెంట్‌గా చేస్తే పిల్లలు తప్పకుండా తినేస్తారు. ఎలాగో తెలుసుకుందామా.
సొరకాయ రైతా.. ఒక పాన్‌లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. అందులోనే కప్పు తురిమిన సొరకాయ వేసి నీరు ఆవిరి అయ్యేవరకు తక్కువ మంట మీద వేయించాలి.ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో పెరుగు, 2 స్పూన్స్ షుగర్, తగినంత ఉప్పు, 2 స్పూన్స్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ నల్ల ఉప్పు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో సొరకాయ పెస్ట్ వేసి కలపాలి.
సొరకాయ ఫుడ్డింగ్.. ఒక పాన్‌లో కప్పు నెయ్యి, కప్పు తురిమిన సొరకాయను కలుపుకోవాలి. అందులోని నీరు ఆవిరయ్యేవరకు తక్కువ మంట మీద దాదాపు 15-20 నిమిషాలు ఉడికించి సొరకాయ బంగారు రంగులోకి మారిన తర్వాత కప్పు పాలు, కప్పు చెక్కర వేసి కలపాలి. పాలను 15 -20 నిమిషాలు ఉడికించాలి. హల్వా పొడిగా ఉన్నప్పుడు తరిగిన బాదం, అక్రోట్లను, పిస్తా వేసి వడ్డించాలి.
సొరకాయ కోఫ్తా.. ఒక గిన్నెలో సొరకాయ తురుముకోవాలి. ఆ తర్వాత 4 స్పూన్ల శనగ పిండి, స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, స్పూన్ పచ్చిమిర్చి వేసి తగినంత నీరు వేసి కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి, పిండిని గుండ్రని బంతులుగా చేసి బంగారు రంగు వచ్చేవరకు డీప్ ఫ్రై చేయాలి.
Also Read: Nivetha Pethu Raj: డైరెక్షన్ చేయడం ఇష్టమంటున్న హీరోయిన్.. త్వరలోనే సినిమా చేసే ఆలోచనలో నివేతా..