Food Waste: ఆహార వృథాతో విసిగిపోతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే ఆ ప్రాబ్లమ్ ఉండనే ఉండదు..
భారతీయ సంస్కృతిలో ఆహాహాన్ని వండుకుని తినడం అనాదిగా వస్తున్న అలవాటు. ఇంట్లో ఉన్న వారందరికీ సరిపోయే ఆహారాన్ని వండి ఆరగించడం మనకు తెలిసిన పద్ధతి. అయితే కొన్ని సార్లు ఇంట్లో తయారు చేసుకున్న..
భారతీయ సంస్కృతిలో ఆహాహాన్ని వండుకుని తినడం అనాదిగా వస్తున్న అలవాటు. ఇంట్లో ఉన్న వారందరికీ సరిపోయే ఆహారాన్ని వండి ఆరగించడం మనకు తెలిసిన పద్ధతి. అయితే కొన్ని సార్లు ఇంట్లో తయారు చేసుకున్న పదార్థాలైనా, బయటి నుంచి తెచ్చుకున్న ఆహారమైనా మిగిలిపోతుంటుంది. ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని పారేయడం తప్పా ఇంకేమీ చేయలేం. ఇలా దేశవ్యాప్తంగా ఆహారం వృథా అయ్యే పరిమాణం అధిక మొత్తంలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా తయారైన ఆహారంలో మూడో వంతు ఆహారం ఏటా వృథా అవుతున్నట్లు పలు నివేదికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆహార వృథాను తగ్గించుకోవడానికి ఈ టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే.. వారానికి సరిపడా భోజనం, అల్పాహారం విషయంలో ప్రణాళికలు ఏర్పరచుకోవాలి. వారానికి కార్యకలాపాలను ప్లాన్ చేయాలి. చాలా మంది ప్రాసెస్ చేసిన ఫుడ్ కు అధిక ప్రాధ్యాన్యత ఇస్తుంటారు. అయితే ఆహార వృథాను తగ్గించడం అనేది షాపింగ్ నుంచే మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. షాపింగ్ చేయడానికి ముందుగానే ఒక జాబితాను రూపొందించాలి. అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. ఉపయోగం లేని వస్తువులను కొనుగోలు చేయకపోవడం ఉత్తమం. మిగిలిపోయిన పదార్థాలను నిల్వ చేయడానికి గాలి చొరబడని కంటైనర్‌లను ఎంచుకోవాలి. ట్రాన్స్ పరెంట్ డబ్బాలను వినియోగించడం ద్వారా ఆ కంటైనర్ లో ఏముందనే విషయాన్ని సులభంగా గుర్తించవచ్చు.
షాపింగ్ చేయడానికి ముందు ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయో చూసుకోవాలి. ఎక్స్ పైరీ డేట్ అయిపోతున్న వస్తువులను త్వరగా వినియోగించుకోవాలి. పాలు, జున్ను, పెరుగును ఎక్కువ సమయం చల్లగా తాజాగా ఉంచడానికి రిఫ్రిజిరేటర్ ను వాడుతుంటారు. అయితే అందులోనూ అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కాకుండా నిర్ణీత టెంపరేచర్ ను మెయింటేన్ చేయాలి. తరిగిన పండ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయల ఉత్పత్తులు త్వరగా చెడిపోకుండా ఉండేందుకు వాటిని ముక్కలుగా చేయకుండా అలాగే నిల్వ ఉంచాలి. మనం ఎక్కువగా వృధా చేసే వస్తువులలో బ్రెడ్ ఒకటి. కాబట్టి బ్రెడ్ ను ఇంటికి తీసుకువచ్చిన రెండు రోజుల్లోనే ఉపయోగించడం ఉత్తమం.
సాధారణంగా ప్రతి ఫుడ్ ఐటమ్ పై ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. అంటే ఆ సమయం దాటిన తర్వాత వాటిని వినియోగించడానికి పనికి రావు. కాబట్టి నిర్ణీత గడువు దాటిన ఫుడ్ ను తినకపోవడం ఉత్తమం. ఎందుకంటే అది సురక్షితం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్యారెట్‌లు, బ్రోకలీ, బచ్చలికూర, టమోటాలు ఎక్కువ సమయం నిల్వ ఉండలేవు కాబట్టి.. ముందుగా వాటిని ఉపయోగించడం ద్వారా ఆహార వృథాను తగ్గించవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి